Site icon NTV Telugu

RAPO22 : న్యూ ఇయర్ స్పెషల్.. రామ్ సినిమా నుండి పోస్టర్

Rapo22

Rapo22

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఫీల్ గుడ్ అండ్ క్రేజీ ఎంటర్‌టైనర్  RAPO22 ప్రొడ్యూస్ చేస్తోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ విజయం తర్వాత మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్‌గా మిస్టర్ బచ్చన్  భామ, యంగ్ అండ్ హ్యాపెనింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది.

Also Read : Pushpa -2 : రూ. 800 కోట్లతో పుష్పరాజ్ ప్రభంజనం

‘మిస్ శెట్టి మిస్టర్  పోలిశెట్టి’ తో ఆకట్టుకున్న దర్శకుడు మహేష్ బాబు. రామ్ తో చేసే సినిమానూ యూత్, ఫ్యామిలీ కథతో తెరకెక్కించనున్నారు. ఇటీవల ఈ సినిమా రెగ్యులర్ షూట్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుగుతోంది. కాగా న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న ఉదయం 10: 35 గంటలకు ఈ సినిమాలో హీరో, హీరోయిన్స్ రామ్, భాగ్యశ్రీల స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారట. వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న రామ్ పోతినేని ఈ సినిమాతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తాడని ఇండస్ట్రీ ఇన్ సైడ్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా కోసం తొలిసారిగా తమిళ మ్యూజిక్ ద్వయం వివేక్ శివ, మెర్విన్ టాలీవుడ్ లో అడుగుపెట్టనున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.

Exit mobile version