NTV Telugu Site icon

Harish Shankar: హరీష్ శంకర్ కి కొత్త టెన్షన్?

Harish Shankar

Harish Shankar

2024 లో తెలుగులోనే కాదు బాలీవుడ్ సహా అన్ని భాషలలో పలు సినిమాలు భారీ డిజాస్టర్ గా నిలిచాయి. అనౌన్స్ చేసినప్పుడు భారీ అంచనాలతో ప్రేక్షకులను ఆకర్షించిన ఈ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత మాత్రం దారుణమైన ఫలితాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే బాలీవుడ్ లో తెరకెక్కిన బేబీ జాన్ కూడా అలాంటిదే. వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో రూపొందించబడిన ఈ సినిమా తమిళంలో గతంలో తెరకెక్కిన తేరి అనే సినిమాకి బాలీవుడ్ రీమేక్. ఈ సినిమాని బాలీవుడ్ జనం ఒక రేంజ్ లో పక్కన పెట్టారు. దీంతో 2024 లోని భారీ డిజాస్టర్ల లిస్టులో ఈ సినిమా కూడా స్థానం దక్కించుకుంది. అయితే ఇప్పుడు ఇదే విషయం హరీష్ శంకర్ మీద ప్రెజర్ పెంచుతుంది. ఎందుకంటే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా తేరి రీమేక్. అయితే హరీష్ శంకర్ కి రీమేక్ సినిమాలను పూర్తిగా మార్చేసి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా తీస్తాడు అనే పేరు ఉంది.

Game Changer: మెగాభిమానులకు దిల్ మామ మార్క్ ‘హై’

అయితే ఆయన అలాగే చేసిన చివరి సినిమా మిస్టర్ బచ్చన్ మాత్రం దారుణమైన పరాజయం అందుకుంది. సినిమా పరంగా పర్వాలేదు అనిపించుకున్నా ఎందుకో సినిమా రిసల్ట్ మాత్రం భారీగా దెబ్బేసింది. దీంతో ఇప్పుడు హరీష్ శంకర్ చేయబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆయనకు ఒక విషమ పరీక్ష లాంటిది అని చెప్పొచ్చు. సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎన్నో మార్పులు చేర్పులు చేసిన ఆయన పవన్ కళ్యాణ్ కి చెప్పి ఫైనల్ చేయాల్సి ఉంది. అయితే గతంలోనే తేరి సినిమా పోలీసోడు పేరుతో తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో అలాంటి సినిమా నే మరోసారి తెరకెక్కిస్తే అది ఎంతవరకు ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారనేది చూడాల్సి ఉంది.. ఇప్పటికే తెలుగులో ఈ సినిమా అందుబాటులో ఉండడం, అదే సినిమాని హిందీలో రీమేక్ చేస్తే భారీ డిజాస్టర్ కావడంతో ఒక రకంగా ఇది హరీష్ శంకర్ కి కీలకమైన పరీక్ష. మరి ఆయన ఈ పరీక్ష ఎలా పాస్ అవుతారో చూడాలి.

Show comments