NTV Telugu Site icon

Nani : నాని సినిమాకు కొత్త కష్టాలు..?

Whatsapp Image 2024 05 16 At 7.16.07 Am

Whatsapp Image 2024 05 16 At 7.16.07 Am

Nani : నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.గతేడాది హాయ్ నాన్న సినిమాతో మంచి విజయం అందుకున్నారు..ప్రస్తుతం దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో “సరిపోదా శనివారం” సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.ఇదిలా ఉంటే సాహో ఫేమ్ డైరెక్టర్ సుజీత్‍తో నాని ఓ మూవీ చేయాల్సి ఉన్నట్లు సమాచారం. అయితే, నాని,సుజీత్ కాంబో మూవీ మొదలవకుండానే ఇబ్బందులు వచ్చాయి.నేచురల్ స్టార్ నానితో దర్శకుడు సుజీత్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ చేసేందుకు సిద్ధం అయ్యారు.

నాని కుడా ఓకే చెప్పడంతో డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్‌ కింద  డీవీవీ దానయ్య ఈ మూవీని నిర్మించేందుకు సిద్ధం అయ్యారు. అయితే, ఈ సినిమా బడ్జెట్ బాగా ఉండటంతో నాని మార్కెట్ బేస్ చేసుకొని అంత బడ్జెట్ పెట్టేందుకు ముందుకు రావట్లేదని సమాచారం.దీనితో నాని ,సుజీత్ మూవీ హోల్డ్ లో పడింది.మరి నాని,సుజీత్ మూవీ సెట్స్ పైకి  వెళ్తుందో లేదో చూడాలి.ప్రస్తుతం నాని నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ సినిమా బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. తాజాగా ఈ మూవీ క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతున్నట్టు మేకర్స్ ఇటీవలే మేకర్స్ ప్రకటించారు.డిఫరెంట్ కాన్సెప్ట్‌తో  వస్తున్న ఈ మూవీ ఆగస్టు 29వ తేదీన గ్రాండ్ గా విడుదల కానుంది.