బాలీవుడ్ లో రియల్ లైఫ్ రొమాంటిక్ ఎఫైర్స్ చాలా మామూలు విషయాలే. అయినా కూడా ఓ యంగ్ బ్యూటీ, మరో యంగ్ హీరోతో క్లోజ్ గా మూవ్ అయితే జనం అమాంతం అలర్ట్ అయిపోతారు. ఇక మీడియా సంగతి సరే సరి! అయితే, సోషల్ మీడియా వచ్చాక ఫ్యాన్స్ డైరెక్ట్ గానే బాలీవుడ్ ‘రూమర్డ్ కపుల్స్’ మీద కామెంట్లు చేస్తూ సరదా తీర్చుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో కియారా అద్వాణీ కూడా చిక్కింది! కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా మధ్యా ఏదో జరుగుతోందని చాలా రోజులుగా రూమర్స్ ఉన్నాయి. వారిద్దరూ ఇంత వరకూ ఏదీ కన్ ఫర్మ్ చేయలేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడూ జనానికి హింట్స్ ఇస్తుంటారు. ఇప్పుడూ అదే చేశారు! లెటెస్ట్ సిడ్ ఓ పిక్ పోస్ట్ చేశాడు. ఎండలో నిలబడి ఆయన తీసుకున్న ఫోటోకు ‘ఛేజింగ్ ద సన్’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అయితే, ఆ పోస్టు వద్దకొచ్చి కామెంట్ చేసిన కియారా మేడమ్… ‘’ ఫోటోగ్రాఫర్ ఈజ్ టూ గుడ్’’ అనేసింది! దాంతో సదరు ఫోటో పోయిన సంవత్సరం మాల్దీవుల్లో తీసిందని నెటిజన్స్ కు అనుమానం కలిగింది. అప్పుడు సిద్దార్థ్ తో పాటూ కియారా కూడా వెకేషన్ కు వెళ్లింది. ఇద్దరూ కలసి లవ్లీ బీచెస్ లో లవ్ ని ఎంజాయ్ చేశారంటారు…
ఇన్ స్టాగ్రామ్ లో సిద్ధార్థ్ మల్హోత్రా ఫోటో పోస్ట్ చేయటం, కియారా కామెంట్ చేయటంతో నెటిజన్స్ చకచకా కామెంట్స్ చేశారు. చాలా మంది కొంటె మాటలే మాట్లాడారు. అయితే, ఒక్క ఫాలోయర్ మాత్రం ‘నీడ’ని కూడా గుర్తు పట్టేశాడు! సిద్ధార్థ్ మల్హోత్రా ఫోటోలోని నీడ కియారాదే అంటూ ప్రకటించేశాడు! నెటిజన్స్ మాటలు ఎలా ఉన్నా కియారా, సిద్ధార్థ్ ఎఫైర్ ఇప్పుడు బాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్ లోనూ ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తోంది. వీరిద్దరూ నటించిన ‘షేర్ షా’ మూవీ జూలై 2న విడుదలవుతోంది. చూడాలి మరి, ఆ సినిమా తరువాత కూడా ఈ లవ్ బర్డ్స్ కలిసే ఉంటారో… లేదా కేవలం సినిమా కోసం… ఇదంతా చేస్తున్నారో! బాలీవుడ్ లో అటువంటి పబ్లిసిటీ వ్యూహాలు కూడా అమలవుతుంటాయి మరి!
