NTV Telugu Site icon

10 ఎపిసోడ్స్ తో ‘మనీ హీస్ట్’ ఫైనల్ సీజన్

Netflix's Money Heist will consist of 10 episodes

నెట్ ఫ్లిక్స్ లో అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సీరీస్ ‘మనీ హీస్ట్’. ఈ స్పానిష్‌ డ్రామాకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానగణం ఉంది. ఇప్పటికే నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ సీరీస్ లో ఐదవది, చివరిది పది ఎపిసోడ్స్ తో రాబోతోంది. ఈ ఐదవ సీజన్ షూటింగ్ పూర్తి అయినట్లు నెట్ ఫ్లిక్స్ తెలియచేసంది. సోషల్ మీడియాలో అధికారికంగా పోస్ట్ చేస్తూ ‘ఈ సీజన్ కథ ఎలా ముగిసిపోతుందో చూపించటానికి మేము కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’ అని తెలిపింది నెట్ ఫ్లిక్స్. ఈ ఫైనల్ సీజన్ షూటింగ్ స్పెయిన్, డెన్మార్క్, పోర్చుగల్ దశాల్లో జరిపారట. ఈ క్రైమ్ సీరీస్ ని వాంకోవర్ మీడియా నిర్మించింది. అయితే ఈ ఐదవ సీజన్ స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అన్నది ప్రకటించలేదు. ఇదిలా ఉంటే ‘మనీ హీస్ట్’ మొదటి నాలుగు సీజన్స్ ఎపిసోడ్స్ ను తెలుగు,తమిళ భాషల్లోకి కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది నెట్ ప్లిక్స్.