Site icon NTV Telugu

సమంతకు నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్

Netflix offering shocking remuneration to Samantha

అక్కినేని సమంతకు స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఇటీవలే ఈ బ్యూటీ “ది ఫ్యామిలీ మాన్-2” అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ వెబ్ సిరీస్ వివాదాస్పదమైనప్పటికీ సమంత నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతేకాదు రాజీగా సమంత నటన చూసిన సెలెబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. దీంతో ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ మరింత పెరిగింది. ఈ సమయంలోనే సమంత క్రేజ్ ను వాడుకోవాలని చూస్తోంది ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్. ఈ మేరకు సమంతతో నెట్ ఫ్లిక్స్ త్రిభాషా వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేస్తోందట. దీనికి సంబంధించి వారు ఇటీవల స్టార్ నటిని సంప్రదించారని తెలుస్తోంది. అయితే మూడు భాషల్లో తెరకెక్కనున్న వెబ్ సిరీస్ కోసం సమంతకు పారితోషికంగా భారీ అమౌంట్ ను ఆఫర్ చేశారని చెబుతున్నారు. నెట్‌ఫ్లిక్స్ సమంతకు రూ.8 కోట్లకు పైగా వేతనం ఇస్తున్నట్లు టాక్. ఈ వార్తలు నిజమైతే గనుక భారతీయ వెబ్ ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలో ఇప్పటివరకు ఇంతటి భారీ పారితోషికం అందుకోబోయే మొదటి నటి సమంత అవుతుంది. ఇక వెబ్ సిరీస్ లో నటించడానికి సమంత కూడా చాలా ఉత్సాహంగా ఉందని, ఈ ప్రాజెక్టుపై ఆమె త్వరలో సంతకం చేయనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఇక సమంత మరిన్ని వెబ్ సిరీస్‌లు చేయడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ “శాకుంతలం” అనే మిథాలజీ మూవీ చేస్తోంది.

Exit mobile version