Nero Teaser Controversy: ప్రమోషన్ల కోసమా.. జనాల అటెన్షన్ కోసమా.. ఆ హీరో చేసింది కరెక్టేనా?

Nero Movie Teaser Controversy

Nero Movie Teaser Controversy

Nero Teaser Controversy: సినిమా జనాల్లోకి వెళ్లాలంటే ఏదో ఒక కొత్త పాయింట్ ఉండాలి. కానీ, ఆ కొత్తదనం పేరుతో మరీ ఇంత బోల్డ్‌గా వెళ్లాలా? ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌తో పాటు, సోషల్ మీడియాలో ఇదే హాట్ డిబేట్ నడుస్తోంది. కొత్త హీరోహీరోయిన్లతో వస్తున్న ఇంటెన్స్ లవ్ డ్రామా ‘నీరో’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయినప్పటి నుంచి.. అందులోని ఆ ఒక్క సీన్ చుట్టూ పెద్ద చర్చే జరుగుతోంది. గీత రచయిత కళ్యాణ చక్రవర్తి డైరెక్టర్‌గా మారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో అరవింద్ హీరోగా పరిచయమవుతుండగా, అర్చన అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది. గోల్డ్ మౌంటైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై అనురాగ్ పర్వతనేని నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి ‘ఫస్ట్ స్పార్క్’ పేరుతో టీజర్ వదిలారు.

అయితే టీజర్‌లోని విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కంటే కూడా.. హీరో చేసిన ఒక పనిపైనే నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. చుట్టూ మంటలు అంటుకుంటుండగా, ఉయ్యాలపై నిద్రపోతున్న హీరోయిన్ దగ్గరకు హీరో వస్తాడు. అక్కడివరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత తన చేతిలోని పెన్నుతో నిద్రపోతున్న హీరోయిన్ ఛాతీపై ప్రేమ కవిత్వం రాయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బ్యాక్‌గ్రౌండ్‌లో పాట, చివర్లో “లెట్ ది వరల్డ్ బర్న్” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ షాట్ కట్ చేశారు.

ఈ విజువల్ బయటకు రాగానే సోషల్ మీడియాలో నెటిజన్లు తమదైన స్టైల్‌లో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. “అంతా బాగానే ఉంది కానీ.. హీరో అలా రాయడం ఎంతవరకు కరెక్ట్? మరీ ఇంత సినిమాటిక్ లిబర్టీనా?” అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు. “రాసుకోవడానికి ఇంకెక్కడా ప్లేస్ దొరకలేదా భయ్యా.. ఏకంగా అక్కడే రాసేశావ్!”, “మరీ ఇంత సినిమాటిక్ లిబర్టీ ఏంటన్నా.. ” అంటూ మీమ్స్, కామెంట్లు కురిపిస్తున్నారు.

మరోవైపు, చిన్న సినిమాలకు పబ్లిసిటీ రావాలంటే ఇలాంటి షాకింగ్ ఎలిమెంట్స్ తప్పవు కదా అనే వాదన కూడా వినిపిస్తోంది. డైరెక్టర్ కళ్యాణ చక్రవర్తి స్వయంగా లిరిసిస్ట్ కావడంతోనే, ప్రేమ కవిత్వాన్ని కొత్తగా చూపించే ప్రయత్నంలో ఈ బోల్డ్ స్టెప్ తీసుకున్నారని కొందరు సమర్థిస్తున్నారు. కారణం ఏదైనా.. కేవలం ప్రమోషన్ల కోసమో, జనాల అటెన్షన్ కోసమో పెట్టిన ఈ ఒక్క సీన్ వల్ల ‘నీరో’ టీజర్‌కు కావాల్సినంత మైలేజ్ అయితే దక్కింది. మరి సెన్సార్ వాళ్లు ఈ సన్నివేశాన్ని సినిమాలో ఉంచుతారా, ఒక వేళ ఉంటే ఈ సన్నివేశం వెనుక ఉన్న అసలు కథేంటో తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.