NTV Telugu Site icon

NBK50Years: బాలయ్య ఈ రికార్డ్స్ ను బద్దలు కొట్టడం ఎవరివల్ల కాదు.. అవేంటో తెలుసా.?..?

Untitled Design (12)

Untitled Design (12)

1 – టాలీవుడ్ సీనియర్ హీరోలలో నిర్విరామంగా 50 సంవత్సరాలుగా సినిమాలు రిలీజ్( గ్యాప్ లేకుండ) చేసిన ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ

2 –  ఆదిత్య 369 సినిమాతో టైమ్ ట్రావెల్ సినిమాను ఇండియన్ తెరకు పరిచయం చేసిన డేరింగ్ అండ్ డాషింగ్ హీరో బాలయ్య

3 – నిప్పురవ్వ, బంగారు బుల్లోడు రెండు భారీ సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయి రెండు సినిమాలు 100 రోజుల ఆడాయి.

4 –  బాలయ్య నటించిన సమరసింహా రెడ్డి ఒక టాలీవుడ్ ట్రెండ్ సెట్టింగ్ సినిమా. ఆ తర్వాత తెలుగులో ఫ్యాక్షన్ కథలతో సినిమాలు వచ్చాయి

5 –   ఒక్క ఫైట్ కూడా లేకుండా బాలయ్య చేసిన సినిమా నారీ నారీ నడుమ మురారి. ఈ చిత్రం 100 రోజలు ప్రదర్శింపబడి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

6 – సాంఘికం, జానపదం, పౌరాణికం, సైన్స్‌ ఫిక్షన్‌, బయోపిక్‌ ఇలా అన్ని జానర్లలో నటించి సూపర్ హిట్​ కొట్టిన ఏకైక స్టార్ హీరో బాలయ్య.

7 – బాలకృష్ణ నటించిన మొత్తం 108 సినిమాలలో 71 సినిమాలు 100 రోజులకుపైగా థియేటర్లో రన్ అయ్యాయి.

8 – బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన లెజెండ్‌ 1000కి పైగా రోజులు పైగా థియేటర్లో ఆడి సౌత్ ఇండియాలో మరే  హీరో అందుకోలేని రికార్డు సాధించాడు

9 – ఇటీవల కాలంలో టాలీవుడ్ సీనియర్ హీరోలలో100 రోజులు ( అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి) హ్యాట్రిక్ విజయాలు సాధించిన హీరో బాలయ్య

10 – సినిమా హీరో, ఎమ్మెల్యే, హాస్పిటల్ ఛైర్మన్ గా మూడు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏకైక టాలీవుడ్  హీరో నందమూరి బాలకృష్ణ

11 –  ఒకే ఏడాదిలో( 1987)  8 సినిమాలు రిలీజ్ చేసి 8 సూపర్ హిట్ కొట్టిన ఘనత ఒక్క బాలయ్యకే  సొంతం

ఇలాగే మరిన్నీ రికార్డులు సాధించి, టాలీవుడ్ ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటూ 50ఏళ్ల సినీస్వర్ణోత్సవం చేసుకుంటున్న అన్ స్టోపబబుల్ హీరో నందమూరి బాలకృష్ణకు ఇవే మా శుభాకాంక్షలు

Show comments