Site icon NTV Telugu

NBK50inTFI : బాలయ్య @ 50 ఇయర్స్.. యంగ్ హీరోలు ఎవరెవరు ఏమన్నారంటే..?

Untitled Design (13)

Untitled Design (13)

నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్  చేశారు. శ్రేయాస్ మీడియా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంతోమంది అతిరథమహారథులు పాల్గొన్నారు. ఇటు టాలీవుడ్ యంగ్ హీరోలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎవరెవరు ఏమన్నారంటే..

నాని : నా వయసుకి 10 సంవత్సరాలు ఎక్కువ ఈ మీ 50 ఏళ్ల వేడుకలు. బాలయ్య గారిని ఒకసారి కలిసిన, దగ్గరగా చూసిన వెంటనే ఆయనను ఇష్టపడిపోతారు. మీరు ఇలాగే మరో 100 సినిమాలు చేయాలి, 100 ఏళ్ల బ్రతకాలి.  

విజయ్ దేవరకొండ : బాలయ్య గారు 50 ఏళ్ల ఇలా నటనా రంగంలో ఉండటం, వైద్య రంగంలో ఇలా సేవ చేయడం మేము చూస్తూనే పెరిగాం. నాకు తెలిసిన వాళ్ళు కూడా మీ హాస్పటల్ లో చికిత్స పొందరు. నేను తొలిసారి లైగర్ షూటింగ్ లో కలిసాను. మీరు ఇలాగే నవ్వుతూ ఉండాలి.

సిద్దు జొన్నలగడ్డ : కలిసిన 5-6 సార్లు కూడా నేను చూసినది ఏంటి అంటే బాలయ్య గారు ఎవరిని అయిన నిజాయితీగా ఉంటే కచ్చితంగా ఇష్టపడతారు. మీ అనుభవం అంతా లేదు నా వయసు. మీరు నాకు ఇన్స్పిరేషన్.

అడివి శేష్ : చిన్నప్పుడు మీ పాటలకు డాన్స్ లు చేసే వాళ్ళం. ఈరోజు మీ గురించి ఇలా మీ గురించి మాట్లాడటం చాల సంతోషం.

అల్లరి నరేష్ : బాలయ్య గారు చాల సరదా మనిషి. మీ 50 ఏళ్ల ఈ వేడుకలు జరుపుకోవడం సంతోషం.

రానా దగ్గుబాటి : నేను బాలకృష్ణ గారి సినిమా విడుదల రోజున పుట్ట అందుకే ఇలా కొంచం అల్లరి చేస్తూ ఉంటా, జై బాలయ్య

మంచు విష్ణు : జై బాలయ్య! బాలకృష్ణగారు  ఇలాగే 100 సంవత్సరాలు చేసుకోవాలి.

Exit mobile version