NBK112 Movie Launch Date: టాలీవుడ్లో మోస్ట్ పవర్ఫుల్ కాంబో.. ‘NBK112’ ముహూర్తానికి డేట్ ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NBK112 Movie Launch Date: నటసింహం నందమూరి అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. నందమూరి బాలకృష్ణ హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ NBK112 అధికారికంగా ఖరారైన విషయం తెలిసిందే. ఈ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రానికి ముహూర్తపు వేడుకకు ముహూర్తం ఖరారైందని తాజా సమాచారం. జూన్ 25, 2026న హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రారంభోత్సవం ఘనంగా జరగనుందని చెబుతున్నారు. ఆగస్టు నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన ఈ ఏడాది మే నెలలోనే వచ్చిన సంగతి తెలిసిందే. కాంబినేషన్ అనౌన్స్ చేసిన అతి తక్కువ సమయంలోనే.. బాలకృష్ణకు సంబంధించిన లుక్ టెస్టులను కూడా మేకర్స్ అత్యంత రహస్యంగా పూర్తి చేసినట్లు టాలీవుడ్ టాక్. ‘దేవర’ వంటి భారీ సక్సెస్ తర్వాత కొరటాల శివ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి రాసుకున్న పవర్ఫుల్ స్క్రిప్ట్ ఇది. బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టుగా, కొరటాల శివ మార్క్ సోషల్ మెసేజ్‌తో కూడిన ఒక ‘భారీ మాస్ యాక్షన్ డ్రామా’గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుందని చెబుతున్నారు.
Also Read
ఇక ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సినీ సర్కిల్లో జోరుగా చక్కర్లు కొడుతుంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్కు యంగ్ మ్యూజికల్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించే ఛాన్స్ ఉన్నట్లు గట్టిగా వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే బాలయ్య – అనిరుధ్ కాంబోలో రాబోతున్న మొదటి చిత్రం ఇదే అవుతుంది. బాలకృష్ణ కెరీర్లో 112వ చిత్రంగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌పై నందమూరి అభిమానుల్లో అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. బాలయ్య మాస్ పల్స్ తెలిసిన కొరటాల శివ.. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!