నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం NBK111 వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటోంది. ‘వీరసింహారెడ్డి’ వంటి భారీ విజయం తర్వాత వస్తున్న కాంబో కావడంతో దీనిపై మంచి అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాలో మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా.. ఇటీవలె మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే, లేటెస్ట్‌గా ఈ సినిమాలో మంచు మనోజ్ పాత్రకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త బయటికొచ్చింది. నిజానికి, ఈ సినిమాలో మనోజ్ విలన్‌గా నటిస్తున్నట్టు టాక్ ఉంది.
కానీ మనోజ్ మొదట బాలకృష్ణకు తమ్ముడి పాత్రలో కనిపిస్తారని, కథలో వచ్చే ఒక కీలక మలుపు తర్వాత ఆయన మెయిన్ విలన్‌గా మారుతాడని టాక్. అంటే, బాలయ్య వర్సెస్ మనోజ్ మధ్య వచ్చే సన్నివేశాలు.. అన్నదమ్ముల సెంటిమెంట్‌తో పాటు, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటాయని స్పష్టమవుతోంది. కానీ, మనోజ్ పాత్ర చాలా ఇంటెన్స్‌గా, నెగటివ్ షేడ్స్‌తో కూడి ఉంటుందని సమాచారం. గోపీచంద్ మలినేని తన సినిమాల్లో విలన్ పాత్రలను చాలా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దుతారు. మరి బాలయ్యతో ఢీ కొట్టడమంటే.. మనోజ్ పాత్ర ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మిరాయ్ సినిమా నుంచి మనోజ్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్ పాత్రలకు ప్రాధాన్యత ఇస్తుండటంతో, బాలయ్య లాంటి మాస్ హీరోను ఆయన ఎలా ఢీకొంటారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఎన్బీకె 111 ఎలా ఉంటుందో చూడాలి.
