NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి అభిమానులకు, తెలుగు సినీ ప్రియులకు పూనకాలు తెప్పించే క్రేజీ అప్డేట్ వచ్చేసింది. తరతరాలుగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నారు. బాలయ్య బాబు కెరీర్లో 111వ మైల్‌స్టోన్‌గా తెరకెక్కుతున్న #NBK111 చిత్రం నుంచి మోస్ట్ అవేటెడ్ గ్లింప్స్ విడుదల అయింది. 91 సెకన్ల నిడివి గల ఈ వీడియో, ఇంటర్నెట్ టైమ్‌లైన్స్‌ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ వీడియో చూస్తుంటే బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని విజన్, ప్రెజెంటేషన్ ఈ సినిమాలో వేరే లెవెల్లో ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లోని హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు, స్టైలిష్ లుక్స్, సరికొత్త మేనరిజమ్స్‌తో బాలకృష్ణను ‘జెన్-జీ’ ట్రెండ్‌కు తగ్గట్టుగా ప్రెజెంట్ చేయబోతున్నారని క్లారిటీ వచ్చేసింది. కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే గోపీచంద్ మలినేని-బాలయ్య కాంబోలో మరో సంచలన విజయం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
Also Read
- Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. బాలయ్య సినిమాలకు థమన్ ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ 91 సెకన్ల గ్లింప్స్‌లో ప్రతి ఫ్రేమ్‌ను తన నెక్ట్స్ లెవెల్ మ్యూజిక్‌తో థమన్ ఎలివేట్ చేశాడు. సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మంచు మనోజ్ కూడా కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా పవర్ఫుల్ డైలాగ్స్ ఈ చిత్రానికి అదనపు బలాన్ని ఇవ్వనున్నాయి.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!