NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!

Nbk

Nbk

నందమూరి అభిమానులకు, తెలుగు సినీ ప్రియులకు పూనకాలు తెప్పించే క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. తరతరాలుగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నారు. బాలయ్య బాబు కెరీర్‌లో 111వ మైల్‌స్టోన్‌గా తెరకెక్కుతున్న #NBK111 చిత్రం నుంచి మోస్ట్ అవేటెడ్ గ్లింప్స్ విడుదల అయింది. 91 సెకన్ల నిడివి గల ఈ వీడియో, ఇంటర్నెట్ టైమ్‌లైన్స్‌ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ వీడియో చూస్తుంటే బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని విజన్, ప్రెజెంటేషన్ ఈ సినిమాలో వేరే లెవెల్‌లో ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లోని హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు, స్టైలిష్ లుక్స్, సరికొత్త మేనరిజమ్స్‌తో బాలకృష్ణను ‘జెన్-జీ’ ట్రెండ్‌కు తగ్గట్టుగా ప్రెజెంట్ చేయబోతున్నారని క్లారిటీ వచ్చేసింది. కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే గోపీచంద్ మలినేని-బాలయ్య కాంబోలో మరో సంచలన విజయం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

×
×
Ad

మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. బాలయ్య సినిమాలకు థమన్ ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ 91 సెకన్ల గ్లింప్స్‌లో ప్రతి ఫ్రేమ్‌ను తన నెక్ట్స్ లెవెల్ మ్యూజిక్‌తో థమన్ ఎలివేట్ చేశాడు. సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మంచు మనోజ్ కూడా కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా పవర్‌ఫుల్ డైలాగ్స్ ఈ చిత్రానికి అదనపు బలాన్ని ఇవ్వనున్నాయి.