NTV Telugu Site icon

NBK109 : బాలయ్య బాబీ టీజర్ డేట్ ఇదే.. ఊచకోత మెుదలు

Nbk109

Nbk109

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం NBK 109. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చకచక జరుగుతుంది. బాలయ్య సరసన తమిళ భామ శ్రద్దా శ్రీనాధ్ నటిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ రోల్ లో నటిస్తున్నాడు. ఇప్పటికే రాజస్థాన్ షెడ్యూల్ ముగించిన యూనిట్ తాజాగా హైదరాబాదులోని ప్రత్యేక సెట్స్ మధ్య యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలయ్య బర్త్ డే కానుకగా వచ్చిన ఈ చిత్ర టీజర్ విశేషంగా ఆకట్టుకుంది.

Also Read : kannappa : ప్రభాస్ ఫోటో లీక్ వీరుడు దొరికాడు.. మరి 5లక్షలు ఎవరికో..?

దీపావళి కానుకగా ఈ చిత్ర టైటిల్ టీజర్ ను ప్రకటిస్తామని నిర్మాత నాగవంశీ ఆ మధ్య ప్రకటించాడు. ఈ చిత్రానికి ‘డాకు మహారాజ్’ ‘వీరమాస్’ ‘సర్కార్ సీతారాం’ ఇలా రకాల పేర్లు టైటిల్ గా వినిపించాయి. కానీ VFX వర్క్ బ్యాలెన్స్ ఉండడంతో వాయిదా వేస్తున్నామని నిర్మాత నాగవంశీ ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో వెల్లడించారు. కాగా విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్ టీజర్ ను నవంబరు 15న రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసారు మేకర్స్. తెలిసిన వివరాల ప్రకారం ఈ సినిమాకు ” ఢాకు మహారాజ్” టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. బాలయ్యను ఇదివరకు ఎన్నడు చూడని విధంగా సరికొత్తగా చూపించబోతున్నాడు బాబి. హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా  సంక్రాంతి కానుకగా జనవరి లో రిలీజ్ చేయనున్నారు.

Show comments