NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్

Nbk 111

Nbk 111

నందమూరి నటసింహం బాలకృష్ణ మరియు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. NBK 111 పేరుతో  తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ సినిమాపై బజ్ ను మరింత పెంచుతుంది.

సాధారణంగా బాలయ్య సినిమాల్లో ఐటెం సాంగ్‌లకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అందుకు తగ్గట్టే ఇప్పుడు రాబోతున్న NBK 111లోను స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేసాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. వీరసింహ రెడ్డిలో ఐటం సాంగ్ ను చంద్రిక రవిని తీసుకొచ్చిన దర్శకుడు ఈసారి ఏకంగా బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీని దించుతున్నాడు. బాలీవుడ్ లో వచ్చిన ‘రాక్‌స్టార్’ హౌస్ ఫుల్ 5వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన ఈ భామ ఇప్పుడు బాలయ్య సరసన ఆడిపాడేందుకు సిద్ధమైంది. ఈ మాస్ మసాలా పాటను ఈ శుక్రవారం నుండి హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో చిత్రీకరించనున్నారు. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా ఆయన వేసే పవర్‌ఫుల్ మాస్ స్టెప్స్‌కు నర్గీస్ ఫక్రీ గ్లామర్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర మోత మొగిపోవడం ఖాయం. బాలయ్య ఎనర్జీకి దీటుగా నర్గీస్ తన గ్లామర్‌తో ఈ పాటను నెక్స్ట్ లెవల్‌కు తీసుకువెళ్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ అప్‌డేట్ విన్న నందమూరి అభిమానులు అప్పుడే సోషల్ మీడియాలో సంబరాలు మొదలుపెట్టారు.