నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతానికి అఖండ 2 సినిమా తెరకెక్కుతోంది. సూపర్ హిట్ అయిన అఖండ తర్వాత బోయపాటి శ్రీను ఈ సినిమాని ఆ సినిమాకి సీక్వెల్ గా తెరికెక్కిస్తున్నాడు. ఇటీవలే బాలకృష్ణ డాకు మహారాజ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఆయన అఖండ 2 సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడు అనే విషయం మీద అనేక చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆ విషయం మీద క్లారిటీ వచ్చేసింది. ఆయన మరోసారి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఇక నిర్మాతల విషయంలో కూడా పలు చర్చలు జరిగాయి కానీ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలోనే వీరి కాంబినేషన్ సినిమా తెరకెక్కుతోంది.
Samantha: దర్శకుడితో సమంత డేటింగ్.. అర్ధాంగీకారం!
గతంలో వీరిద్దరూ కలిసి వీర సింహారెడ్డి అనే సినిమా చేశారు. ఆ సినిమాని కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ప్రస్తుతం గోపీచంద్ మల్లినేని బాబీ డియోల్ అన్న సన్నీ డియోల్ తో జాట్ అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఏప్రిల్ నెలలో రిలీజ్ అవుతుంది. ఆ సినిమాని కూడా మైత్రి మూవీ మేకర్స్ కనిపిస్తోంది. ఇప్పుడు బాలకృష్ణ గోపీచంద్ మలినేని సినిమా అని కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతోంది. ఇక తాజాగా జరిగిన ఒక ప్రైవేటు పార్టీలో గోపీచంద్ మలినేనీని హగ్ చేసుకుంటూ నందమూరి బాలకృష్ణ జూన్ నుంచి రెడీ అయిపోమంటూ చేసిన కామెంట్స్ దానికి ఊతమిస్తున్నాయి. ఇక బాలకృష్ణ, మరికొంతమంది దర్శకులు చెప్పిన కథలు కూడా విన్నారు కానీ ఆయనకు గోపీచంద్ మలినేని చెప్పిన కథ బాగా నచ్చడంతో వెంటనే దాన్ని పట్టాలు ఎక్కించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.