Site icon NTV Telugu

Nazriya : డివోర్స్ కి సిద్ధం అయిన స్టార్ కపుల్..!

Nazriya Nazim, Fahadh Fazil,

Nazriya Nazim, Fahadh Fazil,

నజ్రియా నజీమ్, ఫహద్ ఫాజిల్.. ఈ కపుల్స్ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలుసు.. ‘రాజా రాణి మూవీతో టాలీవుడ్‌కి పరిచయం అయిన ఈ చిన్నది నేచురల్ స్టార్ నాని సరసన ‘అంటే.. సుందరానికీ’ చిత్రంలో నటించి మెప్పించింది. రీసెంట్‌గా ఈ బ్యూటీ నటించిన ‘సూక్ష్మదర్శిని’ అనే చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. మలయాళంలో విడుదలైన ఈ మిస్టరీ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లోనూ సంచలనంగా మారింది. ఇక ఫహద్ ఫాజిల్ గురించి మాట్లాడుకుంటే.. అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రంలో షికావత్ సార్ పాత్రలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారు మనకు తెలిసిందే. ఇలా కెరీర్ పరంగా దూసుకుపోతున్న ఈ జంట తాజాగా విడాకులకి సిద్ధం అయినట్లు వార్తలు వినపడుతున్నాయి.

Also Read : Vijayashanti : ఇలాంటి వాళ్లను జీవితాంతం క్షమించకూడదు..

నజ్రీయా రీసెంట్‌గా విడుదల చేసిన నోట్‌లో .. పలు వ్యక్తిగత సమస్యలతో బయటికి రావడం లేదని చెప్పుకొచ్చినప్పటికి.. కనీసం బర్త్ డే కూడా చేసుకోలేకపోయా, పైగా తన స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులకు టచ్‌లో ఉండటంలేదు. త్వరలోనే అందరి ముందుకు వస్తాను. ఆ తర్వాత మీకు అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. అని చెప్పడంతో డివోర్స్ రూమర్లు మరింత జోరందుకున్నాయి. అంతేకాదు తాజాగా వీరిద్దరి డివోర్స్‌కు పలు కారణాలున్నాయని టాక్ వినిపిస్తోంది.

నజ్రియాకు పలు హీరోలతో ఎఫైర్లు ఉన్నాయని, పైగా ఆమెకు సినిమాలు చేయొద్దని కండీషన్స్ పెట్టడం ఇలా పలు కారణాలు తమిళ, మలయాళ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అందులోను వీరిద్దరి పెళ్లి జరిగి 11 ఏళ్లు అవుతుంది. ఇప్పటి వరకు వీరిద్దరి మధ్య ఎలాంటి సంతానం లేకపోవడం ఒక కారణమని అంటున్నారు. అందుకే సినిమాలు చేయొద్దని, త్వరగా పిల్లలని కనాలని ఫహాద్ ఫాజిల్ కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరగడం కూడా ఒక కారణమని మలయాళ మీడియా, సోషల్ మీడయాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి అసలు కారణం ఏంటి అనేది తెలియాలి అంటే వెట్ చేయాల్సిందే.

Exit mobile version