Site icon NTV Telugu

Nazriya–Fahadh: విడాకుల గాసిప్‌కు.. క్లారిటీ ఇచ్చిన స్టార్ జంట !

Nazriya Fahadh

Nazriya Fahadh

ఇండస్ట్రీలో అడోరబుల్ కపుల్స్ లిస్ట్‌లో ముందు వరుసలో నిలిచే జంటే ఫహాద్ ఫాసిల్ – నజ్రియా నజీమ్. మలయాళం బ్లాక్‌బస్టర్ బెంగుళూరు డేస్ సమయంలో మొదలైన వీరి ప్రేమ కథ – పెళ్లితో పర్ఫెక్ట్ ఎండ్‌కి చేరింది. కానీ ఇటీవల నజ్రియా సోషల్ మీడియాలో కనిపించకపోవడం, డిప్రెషన్‌ గురించి పోస్ట్ చేయడం వల్ల విడాకుల గాసిప్స్ ఊపందుకున్నాయి.

Also Read : Bhadrakali : లైవ్‌లో గన్ షూటింగ్ చేసిన సురేష్ బాబు, విజయ్ ఆంటోనీ..

‘కొన్ని రోజులు నా మనసు సరిగా లేను, ఎవరితో మాట్లాడాలనిపించలేదు. పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకోలేదు..’ అని పేర్కొనడంతో రూమర్లు బలమైనాయి. ముఖ్యంగా ఫహాద్‌తో మనస్పర్థలు ఏర్పడ్డాయనే ఊహాగానాలు వైరల్‌ అయ్యాయి. అయితే, ఈ ఊహాగానాలన్నింటికీ ఒక్క ఫొటోతో పుల్ స్టాప్ పెట్టింది ఈ జంట. ఫహాద్, నజ్రియా కలిసి ఉన్న లేటెస్ట్ ఫొటోను నజ్రియా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఫొటోలో ఇద్దరూ చిరునవ్వుతో కనిపించడం, వారి మధ్య ఏమాత్రం దూరం లేదన్న సంకేతాలు స్పష్టంగా అర్ధమవుతున్నాయి. ఈ జంట కేవలం నటనకే కాదు, నిర్మాతలుగా కూడా తమ స్థాయిని నిరూపించారు. ఇప్పుడు తమ మధ్య మనస్పర్థలన్నీ వదిలేసి నట్టుగా – ప్రేమను, బంధాన్ని నిలబెట్టుకున్నట్టుగా ఫోటో షేర్ చేసిన నజ్రియా… ‘‘మన బంధాన్ని బలంగా నిలబెట్టుకునే క్షణమే ఇది’’ అనేలా సందేశం ఇచ్చింది.

Exit mobile version