స్టార్ హీరోలకే సవాల్ విసురుతూ, దాదాపు 22 ఏళ్లుగా ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా చక్రం తిప్పుతోంది నయనతార. 2003లో మానస్సినక్కరే అనే మలయాళ చిత్రంతో సినీరంగంలో అడుగుపెట్టిన నయన్ 20 ఏళ్లకు పైగా కెరీర్‌లో ఎన్నో క్లాసిక్స్‌లో నటించి ప్రశంసలు దక్కించుకున్నారు. సినిమాల కంటే వివాదాలతోనే గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి మూవీలో, ‘మన్నన్‌గట్టి సిన్స్ 1960’, యశ్ తో ‘టాక్సిక్’, ‘డియర్ స్టూడెంట్స్’, ‘పెట్రియాట్’, ‘మూకుతి అమ్మన్ 2’, ‘హాయ్’, ‘రక్కాయే’ వంటి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో తీరిక లేకుండా గడుపుతుంది నయన. ఇవి కాక మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. ఇక ఇటు హీరోయిన్‌గా నటిస్తూనే నిర్మాతగానూ మరి అద్భుతమైన చిత్రాలను నిర్మిస్తున్నారు. సినిమాలు, వ్యాపారాలు, బ్రాండ్ అండార్స్‌మెంట్స్‌తో కోట్లలో సంపాదిస్తుంది. అందుకే నయనతార డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇక కెరీర్ విషయం పక్కన పెడితే..
Also Read : Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ ..
ఇటీవల నయనతార- విఘ్నేష్ శివన్‌లు విడిపోతున్నట్లుగా వార్తలు రావడంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ వెంటనే స్పందించిన నయన్.. భర్త, పిల్లలతో కలిసి మురుగన్ ఆలయానికి వెళ్లి పుకార్లకు చెక్ పెట్టారు. అయితే నయనతార జీవితంలో శింబు, ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం గురించి మనకు తెలిసిందే. ఇందులో ప్రభుదేవా తో ప్రేమ వ్యవహారం అత్యంత వివాదాస్పదమైంది. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లి రద్దయ్యింది. కానీ కారణం ఏంటీ అనేది మాత్రం ఓ మిస్టరీ. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం..
ప్రభుదేవా పెళ్లికి చివరి నిమిషంలో నో చెప్పారట. క్రిస్టియన్‌గా ఉన్న నయన్‌ను మతం మారాలని, పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలని, పూర్తిగా ఇంటి పట్టునే ఉండాలని ప్రభుదేవా కండీషన్ పెట్టారట. దీనికి నయన్ అంగీకరించారట. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ పెళ్లి తర్వాత తన మొదటి భార్య పిల్లలు మనతోనే, ఉంటారని ప్రభుదేవా చెప్పడంతో. నయన్ తట్టుకోలేకపోయారని అందుకే ఆయనతో పెళ్లిని రద్దు అయినట్లు కోలీవుడ్ టాక్. ప్రభుదేవాతో రిలేషన్‌పై పలుమార్లు నయనతార ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేసేవారు. అతని కోసం తన కెరీర్, కలలు, ఆశలు, సర్వస్వం వదులుకోవడానికి సిద్ధపడ్డానని.. అయితే బ్రేకప్ వల్ల తనకు మంచే జరిగిందని ఆమె వ్యాఖ్యానించారు.
