Site icon NTV Telugu

పెళ్ళికి సిద్ధమైన నయన్-విగ్నేష్ జంట…!

Nayanthara to get married to Vignesh Shivan!

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ తో కలిసి పెళ్ళికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. నిజానికి చాలాకాలం నుంచి వీరి పెళ్ళికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ తాజాగా వీరి పెళ్లి విషయం ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తరచుగా అభిమానులతో చాట్ సెషన్ నిర్వహిస్తున్నాడు విగ్నేష్. అందులో భాగంగా అభిమానులు అడిగే పలు ఆసక్తికర విషయాలకు సమాధానాలు చెప్తున్నాడు. తాజాగా జరిగిన చాట్ సెషన్ లో నెటిజన్లు ఆయనను పెళ్ళి గురించి ప్రశ్నించగా… వివాహం ఖరీదైనదని, ఆ శుభ కార్యక్రమానికి డబ్బు ఆదా చేస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. కోవిడ్ -19 మహమ్మారి పూర్తిగా తగ్గిన తరువాత ఈ లవ్ బర్డ్స్ వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారట. నయనతారఒక తెరిచి ఉంచిన పుస్తకం. ఆమె రిలేషన్ లో ఉన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఆమె ఎప్పుడూ వాటి గురించి మాట్లాడలేదు. ఈ బ్యూటీ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ‘నానుమ్ రౌడీ ధాన్’ సినిమా షూటింగ్‌లో కలిశారు, తరువాత వారి బంధం ప్రేమగా మారింది. అయితే వీరి పెళ్ళెప్పుడు జరుగుతుందో చూడాలి.

Exit mobile version