సూపర్ స్టార్ తో… లేడీ సూపర్ స్టార్! ఫ్యాన్స్ కి ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది? బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన నెక్ట్స్ మూవీలో సౌత్ ఇండియా టాప్ బ్యూటీ నయనతారతో రొమాన్స్ చేయనున్నాడట! ఆయన ప్రస్తుతం యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ‘పఠాన్’ సినిమా చేస్తున్నాడు. దీపికా పదుకొణే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో రా ఏజెంట్ గా నటిస్తోంది. జాన్ అబ్రహాం విలన్ గా కనిపించబోతున్నాడు. అయితే, ‘పఠాన్’ తరువాత షారుఖ్ సినిమా ఏంటి?
Read Also : రామ్ సినిమాకు బ్రేక్ పడుతుందా!?
కింగ్ ఖాన్ తో తమిళ దర్శకుడు అట్లీ సినిమా చేయబోతున్నాడని కొన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. అయితే, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పై మరింత క్లారిటీ వచ్చింది. షారుఖ్, అట్లీ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయన్ నటించనుందట. ఆమెతో ఇప్పటికే చర్చలు మొదలయ్యాయని సమాచారం. అయితే, ఇంకా దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఒకవేళ నయనతార అంగీకరిస్తే ఎస్ఆర్కే మూవీతోనే ఆమె బీ-టౌన్ ఎంట్రీ ఇచ్చినట్టు అవుతుంది…
తాను బాలీవుడ్ లో ప్రవేశించి 29 ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలిపాడు షారుఖ్. అయితే, మూడు దశాబ్దాలుగా సినీ రంగంలో ఉన్నప్పటికీ గత కొంత కాలంగా బాద్షా కెమెరాకి దూరంగా ఉండిపోయాడు. వరుస ఫ్లాపులతో ఆయన భారీ గ్యాప్ తీసుకున్నాడు. చాలా కాలం తరువాత ‘పఠాన్’ సినిమాతో కెమెరా ముందుకొచ్చాడు. ఆ సినిమా తరువాత అట్లీ మూవీ తెరకెక్కుతుందని సమాచారం…
