Site icon NTV Telugu

Naveen Chandra : హనీతో నవీన్ చంద్ర కొత్త ప్రయాణం ప్రారంభం ..!

Naveen Chandra

Naveen Chandra

‘అందాల రాక్షసి’ తో తెలుగు తెరకు పరిచయం అయిన టాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర. తన నటనతో మెప్పించినప్పటికీ, కమర్షియల్ హిట్లు మాత్రం కొంత కాలంగా దక్కడం లేదు. అయినా కూడా, ఆయన వినూత్న కథలను ఎంచుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. వరుస పెట్టి త్రిల్లింగ్ చిత్రాలతో అలరిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా, సైకలాజికల్ థ్రిల్లర్ ‘హనీ’ సినిమా ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే నవీన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Also Read : Preity Mukundham : ప్రభాస్ పై ‘కన్నప్ప’ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

‘మా ప్రయాణం త్వరలో ప్రారంభం..’ అంటూ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. దీంతో కొంతమంది నెటిజన్లు అతను కొత్తగా ప్రేమలో పడ్డ డేమోనని అనుకున్నారు. కానీ తీరా విషయం తెలిసి నవీన్ కొత్త సినిమా ప్రమోషన్ మట్టేనని తెలిసి కొంతమంది నిరాశ కూడా వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘పలాస 1978’ తో విమర్శకుల ప్రశంసలు పొందిన కరుణ కుమార్, ఈసారి భావోద్వేగాలు, మానసిక సంఘర్షణ మధ్య నడిచే గాఢమైన కథతో తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, రవి పీతలతో కలిసి శేఖర్ స్టూడియో బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సంగీతం అజయ్ అరసాడ అందించగా, దివ్య పిళ్లై, దివి వడ్లమణి, రాజా రవీంద్ర, కళ్యాణి మాలిక్, బేబీ జయని తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమైనట్లు నవీన్ అధికారికంగా ప్రకటించారు.

Exit mobile version