NTV Telugu Site icon

Manchu Vishnu: ‘మా’ ఆధ్వర్యంలో నవతిహి 2024

Whatsapp Image 2024 05 08 At 11.21.14 Am

Whatsapp Image 2024 05 08 At 11.21.14 Am

తెలుగు సినిమా ప్రయాణం 1932లో ప్రారంభం అయింది.దీనితో ఈ 90 ఏళ్ల తెలుగు సినిమా ప్రయాణాన్ని ఎంతో ఘనంగా నిర్వహించేందుకు మలేషియా గొప్ప వేదిక కానుంది. నవతిహి ఉత్సవం 2024 పేరీట ఈ కార్యక్రమం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా ) ప్రెసిడెంట్ మంచు విష్ణు ఆధ్వర్యంలో ఘనంగా జరగనుంది.మలేషియాలోని కౌలాలంపూర్‌లోని బుకిట్ జలీల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ స్టేడియంలో “ఈ నవతిహి ఉత్సవం 2024 ” వేడుకని జూలై 20, 2024న ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు ఎందరో సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.

ఈ వేడుక యొక్క ప్రాముఖ్యతని వివరిస్తూ, ఈ కార్యక్రమానికి ప్రోత్సాహకరంగా నిలిచినా వారందరిని పరిచయం చేస్తూ సన్‌వే పిరమిడ్, సన్‌వే రిసార్ట్‌లో ఈ కార్యక్రమానికి సంబంధించిన లాంచ్, ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.మూడు దేశాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను ఎంతో నిశితంగా పరిశీలించిన తర్వాత, ఈ ప్రతిష్టాత్మకమైన ఈవెంట్‌ను మలేషియాలో నిర్వహించడం ఉత్తమమని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ వేడుకను మలేషియా టూరిజం , మా (MAA), స్థానిక ఈవెంట్ ఆర్గనైజర్ MC ఎంటర్‌టైన్‌మెంట్‌తో భాగస్వామ్యంతో ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు..