NTV Telugu Site icon

SIIMA 2024 : నాని సినిమాలకు సలాం కొట్టిన ‘సైమా’.. మొత్తం ఎన్ని అవార్డ్స్ వచ్చాయంటే..?

Untitled Design (21)

Untitled Design (21)

నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకెళుతున్నాడు. అతని గత సినిమాలు కమర్షియల్ హిట్‌లుగా మారడంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందాయి. దుబాయ్‌లో జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2024లో నాని సినెమాలు సంచలనం సృష్టించాయి. దసరా మరియు హాయ్ నాన్న సినిమాలు మొత్తం తొమ్మిది అవార్డులు గెలుచుకున్నాయి. దసరాలో నాని అద్భుత నటనకు గాను అతనికి ఉత్తమ నటుడు (తెలుగు) అవార్డును తెచ్చిపెట్టింది. కీర్తి సురేష్‌కి ఉత్తమ నటి, శ్రీకాంత్ ఒదెలకి ఉత్తమ దర్శకుడు మరియు దీక్షిత్ శెట్టికి ఉత్తమ సహాయ పాత్రతో సహా ఈ చిత్రం నాలుగు అవార్డులను అందుకుంది.

Also Read : Thalapathy69 : విజయ్ చివరి సినిమాకు అవెంజర్స్ హీరో స్థాయి రెమ్యునరేషన్..?

నాని నటించిన మరొక సినిమా హాయ్ నాన్నా. SIIMA 2024 అవార్డ్స్ లో ఈ సినిమా మొత్తం ఐదు అవార్డులను గెలిచి అత్యధిక అవార్డ్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో ఉత్తమ నటనకు గాను మృణాల్ ఠాకూర్‌కు ఉత్తమ నటి (క్రిటిక్స్), శౌర్యువ్‌కి ఉత్తమ నూతన దర్శకుడు మరియు హేషమ్ అబ్దుల్ వహాబ్‌కు ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డ్స్ అందుకున్నారు. ఉత్తమ నూతన నిర్మాతగా వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు చెందిన డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, ఉత్తమ సహాయ నటిగా బేబీ కియారా సైమా అవార్డ్స్ గెలుపొందారు.

Also Read : SIIMA 2024: బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్) అవార్డు అందుకున్న ‘చిన్న కొండ’

ఇంతకుముందు దసరా మరియు హాయ్ నాన్న రెండూ కూడా ఫిల్మ్‌ఫేర్‌లో అవార్డులు గెలుచుకున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ రెండు సినిమాలు వేటికవే విభిన్నమైన పాత్రలు. దసరాలో భారీ యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో రగ్గుడ్ లుక్ పాత్ర పోషించగా, హాయ్ నాన్నా లో క్లాసీ పాత్రలో సెటిల్డ్ పాత్రలో అత్యద్భుతంగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు నిర్మాతలకు భారీ లాభాలను అందించాయి. నాని ఇటీవల విడుదలైన సరిపోద శనివారం అతని కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది.

Show comments