Site icon NTV Telugu

National Awards : జాతీయ అవార్డులపై నెటిజన్ల ఫైర్ !

National Awards 2025

National Awards 2025

ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి పలు ప్రతిష్టాత్మక అవార్డుల‌లో జాతీయ అవార్డులు కూడా ఒకటి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా వివిధ విభాగాల్లో ఉత్తమ సినిమా‌లు, నటీనటులను పురస్కరించే జాతీయ అవార్డుల లిస్ట్ విడుదలైంది. అయితే ఈసారి ఈ అవార్డుల ఎంపిక పట్ల సినీ ప్రియులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినిమాలతో పాటు పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మక చిత్రాలకూ, అవార్డుల జాబితాలో నిలిచే అవకాశమున్న నటీనటుల‌కూ గుర్తింపు రాకపోవడం చూసి ప్రేక్షకులు నిరాశకు లోనయ్యారు.

Also Read : Jai Hanuman: ఈసారి పాన్ వరల్డ్ టార్గెట్..

ఈసారి ‘యానిమల్’ సినిమాలో రణబీర్ కపూర్ చేసిన పాత్రను మెచ్చుకోని వారే లేరు. అదే విధంగా మళయాళంలో ‘ఆడు జీవితం’ (The Goat Life) చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ జీవించిన లైఫ్‌టైమ్ పెర్ఫామెన్స్ కూడా బహుమతుల జాబితాలో లేకపోవడం ప్రేక్షకులకు అసహ్యాన్ని కలిగించింది. పైగా 12th ఫెయిల్, సామ్ బహుదూర్ వంటి చిత్రాల్లో నటీనటుల ప్రదర్శన కూడా మెచ్చుకోదగినదే అయినప్పటికీ, అవార్డుల కూర్చీ దగ్గర దృష్టిలో పడకపోవడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ అవార్డుల ఎంపికలు నిజంగా న్యాయంగా జరిగాయా? లేక ప్రాసెస్ లో బలమైన కారణం ఉందా? అనే డౌట్లు అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారాయి. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ లో ‘12త్ ఫెయిల్’, ‘సామ్ బహుదూర్’ లాంటి హ్యాష్‌టాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఇక ప్రతి సంవత్సరం అవార్డుల సమయంలో అంచనాలు ఉంటాయి. అవి నెరవేరకపోతే బాధ ఉండటం సహజం. కానీ ఈసారి మాత్రం అవార్డుల ఎంపిక ప్రక్రియ‌పై విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజమైన ప్రతిభకు గుర్తింపు దక్కాలన్నది ప్రతి ప్రేక్షకుడి ఆకాంక్ష. మరి రానున్న రోజుల్లో ఇది నెరవేరుతుందా? అనేది వేచి చూడాలి.

Exit mobile version