Naslen : మలయాళ చిత్రం ‘అలప్పుళ జింఖానా’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కడుపుబ్బా గట్టిగా నవ్వెందుకు రెడీగా ఉండండి స్పోర్ట్స్, కామెడీ, డ్రామా వంటి ఎలిమెంట్స్‌తో థియేటర్స్‌లో ప్రేక్షకులను మెప్పించిన మలయాళ చిత్రం ‘అలప్పుళ జింఖానా’ ఇప్పుడు ఓటీటీలో ఆడియెన్స్‌ను అలరించటానికి సిద్ధం అయింది. తెలుగు , తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ప్రముఖ ఓటీటీ సంస్ధ సోనీలివ్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా జూన్13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఖలీద్ రెహ్మాన్ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ చిత్రాని జాబిన్ జార్జ్, సమీర్ కరాట్,సుబీష్ కన్నంచేరి కలిసి ఈ నిర్మించారు. ఈ మూవీలో నస్లెన్, లుక్మాన్ అవరాన్, గణపతి ఎస్. పొడువాల్, సందీప్ ప్రదీప్, అనఘా రవి, ఫ్రాంకో ఫ్రాన్సిస్, బేబీ జీన్, శివ హరిహరన్ తదితరులు నటించారు.కథలోని చక్కటి కామెడీని, గందరగోళాన్ని బ్యాలెన్స్ చేస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ అలరించింది.
ఇక కథ విషయానికి వస్తే.. ప్రధాన పాత్రధారి జోజో జాన్సన్ (నస్లెన్), ఓ కాలేజీ విద్యార్థి. ఎంతో కష్టపడి తనకు నచ్చిన కాలేజీలోకి స్పోర్ట్స్ కోటా ద్వారా జాయిన్ కావటానికి బాక్సింగ్‌లో చేరతాడు. అయితే కథ అసలు మలుపు అక్కడే తీరుగుతుంది. బాక్సింగ్‌ను నేర్పించే కోచ్ ఆంటోనీ జోషువా (లుక్మాన్ అవరాన్)ను కలిసినప్పుడు. పట్టుదల, శ్రమ, బాక్సింగ్‌లో తగిలే నిజమైన దెబ్బల గురించి మాట్లాడతాడు. దీని కోసం అతను ఎంచుకున్న షార్ట్ కట్ ప్రయాణంలో తనను తాను తెలుసుకుని కష్టపడతాడు. దీంతో ఆ జర్నీ అతనికొక మరుపురానిదిగా మారుతుంది. ఈ సందర్భంగా నస్లెన్ మాట్లాడుతూ ‘అలప్పుళ జింఖానా చిత్రంలో నేను జోజో పాత్రలో నటించటం మంచి అనుభూతినిచ్చింది. ఈ పాత్రలో నటించటం ద్వారా నాలోని బలహీనతలు, బలాలను తెలుసుకోగలిగాను. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావటం చాలా సంతోషంగా ఉంది. జూన్13న సోనీ లివ్ ద్వారా యావత్ దేశం ఈ చిత్రాన్ని వీక్షించనుంది’’ అన్నారు.
Also Read
- Mahindra XEV 9S: 679 కిలోమీటర్ల రేంజ్, 20 లక్షల లోపు ధర.. బాలీవుడ్ సెలబ్రిటీల హాట్ ఫేవరెట్ కారు..
- Drishyam 3 OTT: మోహన్ లాల్ దృశ్యం 3 ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
- Allu Arjun Happy: హ్యాపీ రీ రిలీజ్'తో కేరళలో అల్లు అర్జున్ సెన్సేషన్.!
- Deva Katta: డ్రాగన్ డైరెక్షన్ రూమర్స్.. దేవా కట్టా కీలక ప్రకటన
తాజావార్తలు
-
Minister Satyakumar Yadav: ఆరోగ్యశ్రీ క్రెడిట్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదే.. మంత్రి సత్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Mahindra XEV 9S: 679 కిలోమీటర్ల రేంజ్, 20 లక్షల లోపు ధర.. బాలీవుడ్ సెలబ్రిటీల హాట్ ఫేవరెట్ కారు..
-
Ridge Gourd Peel Besan Curry Recipe: బీరకాయ తొక్కలను పారేయకండి.. ఈ సూపర్ కర్రీ ఒక్కసారి ట్రై చేస్తే మళ్లీ వదలరు…
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Petrol Diesel Prices: పాకిస్థాన్‌లో వరుసగా ఐదోసారి తగ్గిన ఇంధన ధరలు.. భారత్‌లో పోలిస్తే ఎంతంటే..?
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!