ప్రేమలుతో మాలీవుడ్, టాలీవుడ్ లో ఓవర్ నైట్ యూత్ స్టార్స్ గా ఛేంజయ్యారు నస్లేన్ కె గఫూర్, మమితా బైజులు. డైలాగ్స్ పేలడం, యూత్ బాగా కనెక్ట్ కావడంతో బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యింది. నస్లేన్, మమితాలకు ఊహించని స్టార్ట్ డమ్ వచ్చి చేరింది. మమితాకు క్రష్ ట్యాగ్ వస్తే.. నస్లేన్ మాత్రం మలయాళంలో గ్యాప్ లేకుండా సినిమాలను సెట్ చేసుకుంటున్నాడు. రీసెంట్ యావరేజ్ హిట్ ఐమాయ్ కథలాన్ తో పలకరించిన ఈ యంగ్ టాలెంట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను దించేస్తున్నాడు.
Also Read : RGIA : శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన
నస్లేన్ బాక్సర్ గా కనిపించబోతున్న ‘అలప్పుజ జింఖానా’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా రీసెంట్లీ మరో క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ చేసేశాడు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాను, దుల్కర్ సల్మాన్ నిర్మిస్తున్నాడు. ఓన్ బ్యానర్ వేఫారర్ ఫిల్మ్స్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్. ఇవే కాదు.. ప్రేమలు 2 త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే ముకుందన్ ఉన్ని అసోసియేట్ డైరెక్టర్ అభినవ్ సుందర్ నాయక్ తో మాలీవుడ్ టైమ్స్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పుడు కుంబలంగి నైట్స్ డైరెక్టర్ మధు సి నారాయణన్ తో మరో ప్రాజెక్ట్ పట్టాలెక్కించబోతున్నాడట. సాధారణంగా ఒక్క హిట్టు సినిమా తీయగానే నెక్ట్స్ పిక్చర్ తీసుకురావడానికి పెద్ద గ్యాప్ తీసుకోరు దర్శకులు. మూవీ సెట్స్ పైకి వెళ్లడం అటు ఉంచితే.. కనీసం నయా ప్రాజెక్ట్స్ అనౌన్స్ మెంటైనా చేస్తారు. కానీ మధు పెద్ద గ్యాపే తీసుకున్నాడు. బ్లాక్ బస్టర్ బొమ్మ కుంబలంగి నైట్స్ ఇచ్చిన తర్వాత ఆరేళ్ల గ్యాప్ తీసుకుని.. ఇప్పుడు నస్లేన్ తో నయా ప్రాజెక్ట్ షురూ చేశాడు. ప్రజెంట్ కాస్టింగ్ జరుగుతున్న ఈ ప్రాజెక్టు త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. సిక్స్ ఇయర్ గ్యాప్ తీసుకున్న మధు కుంబలంగి నైట్స్ లాంటి క్లాసిక్ చిత్రాన్ని నస్లేన్ ఖాతాలో వేస్తాడేమో చూడాలి