Site icon NTV Telugu

Nari Nari Naduma Murari Hit: ఒక్క సినిమా.. ముగ్గురు కంబ్యాక్!

Nari Nari Naduma Murari Hit

Nari Nari Naduma Murari Hit

భీమ్లా నాయక్, బింబిసార, విరూపాక్ష సినిమాలతో సంయుక్త మీనన్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టారు. హ్యాట్రిక్ కొట్టడమే కాదు.. అప్పటి వరకు ఫ్లాప్స్‌లతో సతమతమౌతున్న కళ్యాణ్ రామ్, సాయి తేజ్‌కు సక్సెస్‌లు ఇచ్చి గోల్డెన్ లేడీగా మారారు సంయుక్త. కానీ ఆ తర్వాత ఆ మ్యాజిక్ వర్కౌట్ కాలేదు. వరుసగా నందమూరి వారసులతో జోడీ కట్టి.. వాళ్లకు ఫ్లాప్స్ ఇచ్చారు. ముఖ్యంగా వరుస హిట్స్‌తో జోరు మీదున్న బాలయ్యకు ‘అఖండ 2’ బ్రేకులేసింది.

అఖండ 2లో సంయుక్త మీనన్ కాస్త గ్లామరస్‌గా కనిపించినా.. యూజ్ లేకుండా పోయింది. అందుకే మళ్లీ న్యాచురల్ లుక్‌లోకి మారిపోయి శర్వానంద్‌తో ‘నారీ నారీ నడుమ మురారీ’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 2026 సంక్రాంతికి బరిలోకి దిగిన ఈ సినిమా.. ఇటు సంయుక్తకే కాదు ‘ఏజెంట్’ గర్ల్ సాక్షి వైద్యకు కూడా హిట్ ఇచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ ఆఫర్ వచ్చినప్పటికీ కొన్ని అనివార్య కారణాలతో తప్పుకున్న సాక్షికి నిరూపించుకోవాల్సిన సమయంలో నారీ నారీ నడుమ మురారీ ఆదుకుంది. ఇప్పుడు సంయుక్త, సాక్షిలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

Also Read: Jigris Movie OTT: పండగ వేళ థియేటర్ల వద్ద సినిమాల రచ్చ.. ఓటీటీలో ‘జిగ్రిస్’ ఊచకోత!

‘మహానుభావుడు’ తర్వాత శర్వానంద్ హిట్ అందుకోలేదు. ‘ఒకే ఒక జీవితం’, ‘మనమే’ డిజాస్టర్ అయ్యాయి. శర్వా గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. తప్పక హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరైన సమయంలో ‘నారీ నారీ నడుము మురారీ’ హిట్ ఇచ్చింది. ఈ విజయంతో శర్వా ట్రాక్ ఎక్కాడు. ఇలా ముగ్గురికి కంబ్యాక్ ఇచ్చింది నారీ నారీ నడుము మురారీ. కొత్త ఏడాదిలో బంపర్ హిట్ అందుకున్న శర్వా, సంయుక్త, సాక్షిలు.. ఇలానే దూసుకుపోవాలి ఫాన్స్ కోరుకుంటున్నారు.

Exit mobile version