Site icon NTV Telugu

Nari Nari Naduma Murari: సంక్రాంతి సినిమాల్లో మొదటి డేట్ వచ్చేసింది… ఆరోజే రిలీజ్

Nari Nari Naduma Murari

Nari Nari Naduma Murari

వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ అవుతున్నట్లు ప్రకటించారు. అందులో శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’ కూడా ఒకటి. ‘సామజ వరగమన’ డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి ఉండకపోవచ్చు అని అందరూ భావించారు, కానీ కొద్ది రోజుల క్రితమే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు టీమ్ ప్రకటించింది.

Also Read : Akhanda 2: అఖండ 2లో బోయపాటి ఇద్దరు కొడుకులు

ఈరోజు సాయంత్రం 5 గంటల 49 నిమిషాలకు ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నారు. టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా జనవరి 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఒక రోజు ముందుగానే అంటే జనవరి 14వ తేదీ సాయంత్రం నుంచి ప్రీమియర్స్ కూడా ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ సరసన హీరోయిన్‌గా సంయుక్త మీనంతో పాటు సాక్షి వైద్య నటిస్తున్నారు. ఈ సినిమాను అనిల్ సుంకర, రాంబ్రహ్మం సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమా ప్రీమియర్స్‌ను ‘ప్రీమియర్స్’ అని కాకుండా, ‘ఈవినింగ్ రిలీజ్’ అని సంబోధించే అవకాశం కనిపిస్తోంది.

Also Read : Temple Lamp Row: సుబ్రమణ్య స్వామి ఆలయ ‘‘దీపం’’పై తీర్పు.. న్యాయమూర్తిపై కాంగ్రెస్-డీఎంకే ‘అభిశంసన’’ తీర్మానం..

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, శర్వానంద్‌కి సంక్రాంతికి వచ్చి హిట్‌లు కొట్టడం కామనే. ‘శతమానం భవతి’ సహా ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ కూడా జనవరి 14వ తేదీనే రిలీజ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో 14వ తేదీ సాయంత్రం సినిమా రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకుని, దానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సంక్రాంతి సినిమాలలో ఇప్పటివరకు డేట్ అనౌన్స్ చేసిన మొదటి సినిమాగా ‘నారీ నారీ నడుమ మురారి’ నిలవనుంది.

Exit mobile version