Allari Naresh : మళ్లీ కామెడీ జానర్లో నరేష్65 గ్రాండ్ గా లాంచ్- ఫస్ట్ క్లాప్ కొట్టిన నాగ చైతన్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లరి నరేష్ హీరోగా వస్తున్న #నరేష్65 చిత్రం శుక్రవారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్ పూజా కార్యక్రమంతో లాంచ్ అయ్యింది. ఫాంటసీ, కామెడీ కలయికలో రూపొందుతున్న ఈ సినిమాకు చంద్ర మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజేష్ దండ, నిమ్మకాయల ప్రసాద్ నిర్మాణ బాధ్యతలు చేపట్టగా, అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై ఈ చిత్రం రూపొందుతోంది. “కామెడీ గోస్ కాస్మిక్” అనే క్యాచ్ లైన్‌తో మేకర్స్ ప్రకటించడంతో ఆసక్తి మరింత పెరిగింది.
Also Read : Mirai : ‘మిరాయ్’ జర్నీ గురించి.. ఊహించని విషయాలు పంచుకున్న కార్తీక్ ఘట్టమనేని
Also Read
- Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
- Mahesh Babu: ‘వారణాసి’ సినిమా రాకముందే మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గట్టి ట్రీట్.. బాబు బర్త్ డేకి ఆ రెండు చిత్రాలు!
- kajal Aggarwal: మగధీర సెట్లో చరణ్ అల్లరిని బయటపెట్టిన కాజల్.. అసలేం జరిగిందంటే!
- Peddi Pre-Release Event : 'పెద్ది' ప్రీరిలీజ్ ఈవెంట్ కు అతిథిగా స్టార్ హీరో
లాంచ్ వేడుకలో నాగ చైతన్య ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టగా, డైరెక్టర్ బాబీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వి.ఐ. ఆనంద్ గౌరవ దర్శకత్వం వహించగా, దర్శకులు వశిష్ట్, రామ్ అబ్బరాజు, విజయ్ కనకమేడల స్క్రిప్ట్‌ను నిర్మాతలకు అందజేశారు. ఈ కార్యక్రమానికి సుప్రియ యార్లగడ్డ, అనిల్ సుంకర, జెమిని కిరణ్, హర్ష్ శంకర్ తదితరులు హాజరయ్యారు. కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఈ సారి కొత్తదనంతో కూడిన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వెన్నెల కిషోర్, నరేష్ వి.కె., శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. టెక్నికల్‌గా కూడా ఈ సినిమాను భిన్నమైన స్థాయిలో తెరకెక్కించనున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ, చేతన్ భరద్వాజ్ సంగీతం, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్షన్, చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. త్వరలోనే #నరేష్65 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
తాజావార్తలు
-
Paris Psg Violence: పీఎస్జీ గెలుపుతో తగలబడ్డ పారిస్.. వందల సంఖ్యలో ఫ్యాన్స్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
-
West Bengal: “రాళ్లతో కొట్టారు?”.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
-
Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
-
IPL 2026 Final: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు జోష్ ఇచ్చే 8 ఏళ్ల సెంటిమెంట్.. ఈ హిస్టరీ రిపీట్ అయితే ఈసారి కప్పు బెంగళూరుదే!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..