Site icon NTV Telugu

Allari Naresh : మళ్లీ కామెడీ జానర్‌లో నరేష్65 గ్రాండ్ గా లాంచ్- ఫస్ట్ క్లాప్ కొట్టిన నాగ చైతన్య

Alari Naresh

Alari Naresh

అల్లరి నరేష్ హీరోగా వస్తున్న #నరేష్65 చిత్రం శుక్రవారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్ పూజా కార్యక్రమంతో లాంచ్ అయ్యింది. ఫాంటసీ, కామెడీ కలయికలో రూపొందుతున్న ఈ సినిమాకు చంద్ర మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజేష్ దండ, నిమ్మకాయల ప్రసాద్ నిర్మాణ బాధ్యతలు చేపట్టగా, అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై ఈ చిత్రం రూపొందుతోంది. “కామెడీ గోస్ కాస్మిక్” అనే క్యాచ్ లైన్‌తో మేకర్స్ ప్రకటించడంతో ఆసక్తి మరింత పెరిగింది.

Also Read : Mirai : ‘మిరాయ్’ జర్నీ గురించి.. ఊహించని విషయాలు పంచుకున్న కార్తీక్ ఘట్టమనేని

లాంచ్ వేడుకలో నాగ చైతన్య ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టగా, డైరెక్టర్ బాబీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వి.ఐ. ఆనంద్ గౌరవ దర్శకత్వం వహించగా, దర్శకులు వశిష్ట్, రామ్ అబ్బరాజు, విజయ్ కనకమేడల స్క్రిప్ట్‌ను నిర్మాతలకు అందజేశారు. ఈ కార్యక్రమానికి సుప్రియ యార్లగడ్డ, అనిల్ సుంకర, జెమిని కిరణ్, హర్ష్ శంకర్ తదితరులు హాజరయ్యారు. కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఈ సారి కొత్తదనంతో కూడిన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వెన్నెల కిషోర్, నరేష్ వి.కె., శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. టెక్నికల్‌గా కూడా ఈ సినిమాను భిన్నమైన స్థాయిలో తెరకెక్కించనున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ, చేతన్ భరద్వాజ్ సంగీతం, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్షన్, చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. త్వరలోనే #నరేష్65 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Exit mobile version