టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ ఓ ఇంటి వాడయ్యడు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అతిరథ మహారాధుల సమక్షంలో ప్రేయసి శిరీష మేడలో మూడు ముళ్ళు వేసాడు నారా రోహిత్. గతేడాది అక్టోబర్ లో నారా రోహిత్ – శిరీష్ ల నిశ్చితార్థం జరిగింది. సరిగ్గా ఏడాది తర్వాత ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి అయ్యారు. శిరీషా స్వస్థలం పల్నాడు జిల్లా రెంటచింతల. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యని అభ్యసించిన శిరీష నటన పై మక్కువతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది.
Also Read : Mega Star : 560 ముక్కలైన దేశాన్ని.. ఒక్కటి చేసిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్
నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటించిన ప్రతినిధి-2 సినిమాలో రోహిత్ ప్రియురాలిగా నటించింది. అదే సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అదే విషయాన్ని ఇంటి సభ్యులకు చెప్పారు. వారి అంగీకారంతో ఇప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. కాగా ఈ వేడుకకు అటు రాజకీయ, సినీ ప్రముఖులు హాజర్యయారు. తన సోదరుడు కీ.శే నారా రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్ వివాహ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వరి దగ్గరుండి అన్ని కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఏపీ ఐటీ మినిష్టర్ నారాలోకేష్ దంపతులు, నందమూరి బాలకృష్ణ దంపతులు నూతన జంటను ఆశీర్వదించారు. యంగ్ హీరోలు మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస, శ్రీ విష్ణు ఈ వేడుకకు హాజరయి రోహిత్ దంపతులకు విషెష్ తెలిపారు. వీరితో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ వేడకలో పాల్గోని వధూవరులను దీవించారు.
