యంగ్ హీరో నారా రోహిత్ ల్యాండ్‌మార్క్ 20వ మూవీ ‘సుందరకాండ’. నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించగా సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించారు. నారా రోహిత్ ఇందులో సిద్ధార్థ్ అనే సింగిల్ మ్యాన్ పాత్రలో కనిపించారు. తను మ్యారేజ్ ఏజ్ దాటినప్పటికీ, ఐదు క్యాలిటీస్ కలిగి ఉన్న పార్ట్నర్ కోసం సెర్చ్ చేయడం, తన మ్యాచస్ కోసం పేరెంట్స్ కూడా విసిగిపోవడం వంటి కథాంశంతో తెరకెక్కింది. ఈశ్వర్ సినిమా ఫేమ్ హీరోయిన్ శ్రీ దేవి విజయ్ కుమార్ ఈ సినిమాతో కమ్ బ్యాక్ ఇచ్చింది.
Also Read : Shocking : ఓవర్సీస్ ‘OG’ డిస్ట్రిబ్యూటర్ సంఘ విద్రోహి.. మా థియేటర్స్ లో ‘OG’ రిలీజ్ చేయడం లేదు
అనేక వాయిదాల అనంతరం సుందరకాండ గత నెల అనగా ఆగస్టు 27న థియేటర్స్ లో రిలీజ్ అయింది. థియేటర్స్ లో ఓ మాదిరి హిట్ టాక్ తెచ్చుకుంది సుందరకాండ. సత్య, నారా రోహిత్ కామెడీ ప్రేక్షకులను అలరించింది. కాగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ రిలీజ్ కు ముందే మంచి ధర పలికాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్ స్టార్ సుందరకాండ డిజిటల్ + సాటిలైట్ న రైట్స్ ను రూ. 9 కోట్లకు కొనుగోలు చేసింది. థియేటర్స్ లో రిలీజ్ అయిన నాలుగు వారాల అనంతరం ఈ రోజు నుండి ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది హాట్ స్టార్. క్లీన్ కామెడీ, చక్కటి కథాంశం, సింప్లి మ్యూజిక్ ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ ఫీల్ ఇచ్చే సుందరకాండ ఈ వారంలో చూడదగ్గ ఫామిలీ ఎంటర్టైనర్ అనే చెప్పాలి. తెలుగుతో పాటు పాన్ ఇండియా బాషలలో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తోంది హాట్ స్టార్.
