Nara Rohith : ఎంగేజ్మెంట్ అయిన నెలలోపే నారా రోహిత్ ఇంట తీవ్ర విషాదం

  • టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఇంట తీవ్ర విషాదం
  • రోహిత్ తండ్రి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు హఠాన్మరణం
  • రేపు రామ్మూర్తి నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో అంత్యక్రియలు
Nara Rohith

Nara Rohith

టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. నిజానికి నారా రోహిత్ ఈ మధ్యకాలంలో తాను ప్రేమించిన శిరీష అనే యువతిని పెళ్లి చేసుకునేందుకు నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుని ఎందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సమయంలో ఆయన తండ్రి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు హఠాన్మరణం పాలయ్యారు. ఈ విషయాన్ని నారా రోహిత్ టీం స్వయంగా ప్రకటించింది. నారా రోహిత్ తండ్రి, చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కార్డియాక్ అరెస్టు కారణంగా ఈరోజు మరణించారు.

Nayanthara Dhanush: హీరో ధనుష్ పై నయనతార సంచలన విమర్శలు.. నువ్వేంటో ఇప్పుడు తెలుస్తుంది

ఆయన అంత్యక్రియలు రేపు రామ్మూర్తి నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో జరగబోతున్నాయి అంటూ ప్రకటించారు. ఇక ఈ ఉదయం రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిసి నారా లోకేష్ హుటాహుటిన తన కార్యక్రమాలు అన్ని రద్దు చేసుకుని హైదరాబాదు వచ్చారు. అలాగే చంద్రబాబు సైతం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సి ఉంది కానీ దానిని కూడా ఆయన రద్దు చేసుకుని హైదరాబాద్ బయలుదేరారు. రామ్మూర్తి నాయుడు గత కొంతకాలంగా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనను ప్రస్తుతం ఏఐజి హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. రామ్మూర్తి మరణంపై నందమూరి రామకృష్ణ సంతాపం ప్రకటించారు. వెంటనే ఆసుపత్రికి చేరుకున్న రామ కృష్ణ… కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలిపారు