NTV Telugu Site icon

Nara Rohit : ఆ హీరోయిన్ తో 13న నారా రోహిత్ ఎంగేజ్ మెంట్..

Rohit

Rohit

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు కొడుకుగా టాలీవుడ్ లో అడుగుపెట్టాడు నారా రోహిత్. తోలి సినిమాగా బాణంతో సరికొత్త కథాశంతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన సోలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. రౌడీ ఫెలో, అప్పట్లో ఒకటి ఉండేవాడు వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించాడు.  ఇండస్ట్రీలో అడుగుపెట్టి చాలా కాలం అవుతోంది ఈ కుర్ర హీరో. ఆ మధ్య కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చి పెదనాన్న పార్టీ తరపున ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో కూడా కనిపించాడు.

కాస్త గ్యాప్ తర్వాత పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నారా రోహిత్. ప్రస్తుతం సుందరకాండ అనే సినిమా రిలీజ్ కు రెడీ గా ఉంది. కాగా నారా రోహిత్ గురించి ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఈ నారా వారబ్బాయి త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఈ నెల 13న నారా రోహిత్ నిచ్చితార్ధం జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ ఇటీవల ఈ హీరో నటించిన  ప్రతినిధి -2 లోని  హీరోయిన్ కు రోహిత్ నిశ్చితార్ధం జరగనుంది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీస్ పాల్గొనబోతున్నాయి. ఎంగేజ్ మెంట్ తో ఒక్కటి కాబోతున్న ఈ జంట వివాహా వేడుకను త్వరలో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. నారా రోహిత్ కు శిరీష్ అనే అన్నయ కూడా ఉన్నారు,