కోవిడ్ -19 సెకండ్ వేవ్ కారణంగా పలు సినిమాల విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆ జాబితాలో నాని నటించిన “టక్ జగదీష్”తో సహా పలు టాలీవుడ్ చిత్రాలు ఉన్నాయి. నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘టక్ జగదీష్’. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జగపతిబాబు, ఐశ్వర్యా రాజేశ్, నాజర్, రోహిణి, దేవదర్శిని, నరేశ్, రావు రమేశ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ‘నిన్నుకొరి’ తరువాత శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. ‘టక్ జగదీష్’కు థమన్ సంగీతం అందించారు. “టక్ జగదీష్” ఏప్రిల్ 23న విడుదల కావలసింది. కానీ ఈ మహమ్మారి వల్ల విధించిన లాక్డౌన్ కారణంగా మేకర్స్ సినిమా విడుదల తేదీని వాయిదా వేశారు. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తగ్గి పరిస్థితులు సాధారణ స్థితిలోకి వస్తున్న కారణంగా ఇప్పటికే విడుదల వాయిదా పడిన చిత్రం మేకర్స్ కొత్త విడుదల తేదీలను ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం “టక్ జగదీష్”ను జూలై 30, లేదా ఆగస్టు 20న విడుదల చేయాలని చూస్తున్నారట మేకర్స్. ప్రభాస్ “రాధేశ్యామ్”ను జూలై 30న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. ఒకవేళ ఆ చిత్రం గనుక వాయిదా పడితే ‘టక్ జగదీష్’ను ఆ తేదీన రంగంలోకి దించడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతానికి సినిమా విడుదల తేదీపై చర్చలు జరుగుతున్నాయట. త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.
ప్రభాస్ రిలీజ్ డేట్ పై కన్నేసిన ‘టక్ జగదీష్’ ?
Show comments