‘దసరా’ బ్లాక్‌బస్టర్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ‘ది పారడైజ్’ మూవీ కోసం మరోసారి చేతులు కలిపారు. కాగా ఈనెల 21న షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా వారం పాటు సాగిన కీలకమైన చైల్డ్ వుడ్ సన్నివేశాల షూటింగ్ తో సినిమా జర్నీ ప్రారంభం కాగా. ఇప్పుడు నాని ఎంట్రీ ఇచ్చారు. ఇక తాజా సమచారం ప్రకారం ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ శివారులోని ఆర్ఎఫ్సీలో శరవేగంగా జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో రియల్ సతీష్ మాస్టర్ నేతృత్వంలో, ఒక మాస్ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ సీక్వెన్స్‌కు ఫారిన్ స్టంట్ మాస్టర్స్ సాయంతో హై ఇంటెన్సిటీ యాక్షన్ డిజైన్ చేశారు. సినిమాకే హైలెట్‌గా నిలవబోయే ఈ యాక్షన్ బ్లాక్‌పై భారీ అంచనాలు ఉన్నాయి..
Also Read : VijayDevarakonda : #VD14 ముహూర్తం ఫిక్స్ ..
ఇక ‘ది పారడైజ్’ పాన్ వరల్డ్ లెవెల్‌లో రిలీజ్ కానుండటంతో సినిమాపై ఇంటర్నేషనల్ బజ్ కూడా పెరిగింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ ఇలా మొత్తం 8 భాషలలో విడుదల చేయనున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన టైటిల్ పోస్టర్, గ్లింప్స్‌తోనే సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. నానిని ఒక పవర్‌ఫుల్ మాస్ అవతారంలో చూపించనున్న ఈ చిత్రం మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
