ప్రజంట్ టాలీవుడ్ స్టార్సక అంతా కూడా పాన్ ఇండియా మూవీస్ తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న విషయం తెలిసిందే. అందులో న్యాచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. దసరా హిట్ తర్వాత మళ్లీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో జతకట్టిన నాని ఈసారి భారీ స్థాయి ప్రాజెక్ట్ చేయనున్నాడు. సుధాకర్ చెరుకూరి ప్రొడక్షన్‌లో నిర్మితమవుతున్న ఈ సినిమా 1980ల నాటి బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందని సమాచారం. ఇందులో కాగా ఇప్పటికే విడుదలైన లుక్స్ లో.. నాని ఈ మూవీలో ఓ కొత్త తరహా మాస్ రోల్‌లో కన్పించనున్నాడు అని స్పష్టంగా అర్ధమవుతుంది.
Also Read : Samantha : ఎట్టకేలకు శుభవార్త చెప్పిన సమంత.. అందరూ అనుకున్నదే చేసిందిగా!
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ రాఘవ్ జుయల్ విలన్‌గా నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ‘‘ది ప్యారడైజ్ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మూవీ అవుతుంది. తెలుగు సినిమాను గ్లోబల్ లెవెల్‌కి తీసుకెళ్లే స్కోప్ ఈ ప్రాజెక్ట్‌కి ఉంది’’ అని రాఘవ్ అన్నారు. అంతేకాదు, తన పాత్రకు న్యాయం చేయడానికి తెలుగు నేర్చుకుంటూ, సొంతంగా డబ్బింగ్ చెప్పేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలిపారు. ఆయన డెడికేషన్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌కి దసరా తర్వాత మరోసారి బ్లాక్‌బస్టర్ హిట్టు ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ‘ది ప్యారడైజ్’లో హీరోయిన్‌గా ఎవరు నటించబోతున్నారు అన్నది ఇంకా క్లారిటీ రాలేదు.
