నాని హీరోగా దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ది పారడైజ్ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. నిజానికి, సినిమా అనౌన్స్‌మెంట్ దగ్గరనుంచి ఒక్కసారిగా అందరి దృష్టి ఈ సినిమా మీద పడింది. దానికి తోడు, నాని లుక్, నాని డైలాగులు సినిమా మరో లెవెల్‌లో ఉండబోతుందని హింట్స్ ఇచ్చాయి. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు, ఈ సినిమాలో విలన్‌గా మోహన్ బాబు నటించనున్నట్లు ప్రకటించారు కూడా. ఇక ఈ సినిమాలో మోహన్ బాబు పాత్రను కూడా ఒక రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.
Also Read:Globe Trotter: బాబు ఫ్యాన్స్ కి లాస్ట్ మినిట్ షాక్.. ఈవెంట్ ఉంటుందా లేదా?
తాజాగా అందుతున్న సమాచారం మేరకు, ఈ సినిమాలో మోహన్ బాబు ఇల్లు ఒక కీలకమైన పాత్ర పోషించబోతోంది. ఈ నేపథ్యంలోనే, ఆ ఇంటి కోసం భారీగా వెచ్చించడానికి ప్రొడ్యూసర్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ సినిమా కోసం దాదాపు ఏడున్నర (7.5) నుంచి ఎనిమిదిన్నర (8.5) కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారట. ఆ ఇంట్లోనే చాలా వరకు షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఫలక్‌నుమా ప్యాలెస్ను పోలి ఉండేలా ఒక కొత్త ఇంటిని మోహన్ బాబు ఇల్లుగా సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద, ఈ సినిమా కోసం అటు దర్శకుడితో పాటు నిర్మాత సైతం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదని ఇప్పుడు స్పష్టం అవుతుంది.
