NTV Telugu Site icon

NANI : నాని సాలిడ్ లైనప్.. నెక్ట్స్ ప్రాజెక్ట్ ఫిక్స్.. దర్శకుడు ఎవరంటే..?

Nani

Nani

యంగ్ హీరోల పరంగా చూస్తే న్యాచురల్ స్టార్ నాని సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు. చివరగా ‘సరిపోదా శనివారం’ సినిమాతో మాసివ్ హిట్ అందుకున్న నాని ప్రస్తుతం హిట్ ఫ్రాంచైజ్‌గా వస్తున్న’హిట్ 3′ చేస్తున్నాడు. ఈ సినిమాలో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. హిట్ సినిమాల దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం హిట్ 3 షూటింగ్ స్టేజీలో ఉంది. ఇక ఈ సినిమా తర్వాత దసరా కాంబో రిపీట్ చేస్తూ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ అనే సినిమా చేస్తున్నాడు.

Also Read : KA 10 : ‘దిల్ రూబా’ రిలీజ్ డేట్ ఫిక్స్.?

ఇది నాని కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రాబోతోంది. దసరాకు మించిన డబుల్ మాస్ సినిమాగా ఉంటుందనే టాక్ ఉంది. ఇక ఆ తర్వాత సుజీత్‌తో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు నాని. ప్రస్తుతం సుజీత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘ఓజి’ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఓజి పూర్తయిన తర్వాత నాని సినిమా పై ఫోకస్ చేయనున్నాడు. ఇక ఇప్పుడు నాని నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో నాని ఓ సినిమా చేయనున్నట్టుగా చాలా రోజులుగా వినిపిస్తునే ఉంది. లేటెస్ట్‌గా ఈ క్రేజీ కాంబో సెట్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ధనుష్‌తో ‘కుబేర’ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు శేఖర్ కమ్ముల. ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల నాని ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడట. దీంతో నాని కోసం శేఖర్ కమ్ముల ఎలాంటి కథను రెడీ చేస్తాడా  అనేది ఆసక్తికరంగా మారింది.