NTV Telugu Site icon

Nani: నేచురల్ స్టార్ ఫ్యాన్స్ ను భయపెడుతున్న శనివారం ‘రన్ టైమ్’.

Untitled Design (31)

Untitled Design (31)

నేచురల్ స్టార్ నాని హీరోగా ‘సరిపోదా శనివారం’ రూపొందింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించారు. మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయని ట్రైలర్ చుస్తే అర్ధం అవుతుంది.నానికి జోడిగా ప్రియాంక మోహన్ నటిస్తోంది. ఈ ఆగస్టు 29న ‘సరిపోదా శనివారం’ విడుదల కానుంది. ‘దసరా’, హాయ్ నాన్న వంటి హిట్స్ తర్వాత సరిపోదా శనివారం’ తో హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు నాని. ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్, గ్లింప్స్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

Also Read: Devara: దేవర బెన్ ఫిట్ షో టికెట్ ‘ధర’ తెలిస్తే.. గుండె దడపుట్టాల్సిందే..

మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానున్న ఈ చిత్ర ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఇటీవల ఈ సినిమా సెన్సార్ కంప్లిట్ చేసుకుంది. 2 గంటల 46 నిమిషాల రన్ టైమ్ తోఫైనల్ కాపీ రెడీ చేసారు. సెన్సార్ టీమ్ యు/ఎ సర్టిఫికెట్ ను జారీ చేసింది. ఈ రన్ టైమ్ నాని ఫ్యాన్స్ ను భయపెడుతోంది. నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన అంటే.. సుందరానికి 3 గంటల రన్ టైమ్ తో వచ్చి నిరాశపరించింది. ఇప్పుడు ఈ సినిమాకు కూడా ఇంత రన్ టైమ్ అంటే కాస్త భయపడాల్సిన పరిస్థితి. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కంటే విలన్ క్యారెక్టర్ ఎక్కువ హైలెట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో హీరో పాత్ర ఎక్కువగా సైలెంట్ గా ఉండిపోవాల్సి వస్తుందట. దీంతో ఎస్.జె.సూర్య చెలరేగిపోయాడు అని.. అతని విలనిజం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అంటున్నారు. అదేనా జరిగితే నాని ఫ్యాన్స్ నిరుత్సాహ పడక తప్పదు.

Show comments