Site icon NTV Telugu

‘Mirai’ : పారితోషికం లొసుగుతో ‘మిరాయ్’ను వదులుకున్న స్టార్ హీరో..

Mirai

Mirai

హనుమాన్‌తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత తేజ సజ్జా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఒకే ఒక్క బ్లాక్‌బస్టర్‌తో ఆగిపోకుండా, మరో పెద్ద హిట్ ఇవ్వాలని పట్టుదలతో ముందుకెళ్లాడు. అలా ఎన్నో కథలు విన్న తర్వాత, చివరికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన ‘మిరాయ్’ని ఎంచుకున్నాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కి, విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

Also Read : Bigg Boss 9 : ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అయ్యేది ఎవరో తెలుసా..!

కానీ ఈ సినిమా మొదట తేజ దగ్గరకు రాలేదట. కార్తీక్ ఘట్టమనేని ఈ కథను మూడు సంవత్సరాల క్రితమే సిద్ధం చేసుకున్నారు. ఆ సమయంలో పలు స్టార్ హీరోలను సంప్రదించారు. అందులో నాని కూడా ఒకరు. కథ విన్న వెంటనే నానికి బాగా నచ్చింది. అయితే, పారితోషికం విషయంలో విభేదాలు రావడంతో ఆయన వెనక్కి తగ్గారు. అదే సమయంలో ఇతర హీరోలు కూడా రిస్క్ చేయడానికి ఇష్టపడక, ఈ ప్రాజెక్ట్‌ను వదిలేశారు. తర్వాత సరైన హీరో కోసం వెతికిన కార్తీక్ ఘట్టమనేని, తేజ సజ్జాలో ఆ ఎనర్జీని చూశారు. కథ విన్న వెంటనే తేజ ఎలాంటి ఆలోచన లేకుండా అంగీకరించాడు. ఈ నిర్ణయమే ఇప్పుడు అతని కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ భారీ ప్రాజెక్ట్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కి కూడా చాలా రోజుల తర్వాత మంచి సూపర్ డూపర్ హిట్‌ను అందించింది.

తేజ సజ్జా నటనకు విమర్శకులు, ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మంచు మనోజ్, శ్రియ, హీరోయిన్ పాత్రలు కూడా కథలో బలం గా నిలిచాయి. చాలా తక్కువ ఖర్చుతోనే అద్భుతమైన VFX‌ను చూపించడం దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ప్రతిభను రుజువు చేసింది ఇప్పుడు చూస్తే, ‘మిరాయ్’ను వదులుకున్న హీరోలందరికీ ఇది చేదు అనుభవం గా మిగిలిపోయింది. ఎందుకంటే ఈ సినిమా విజయంతో తేజ సజ్జా కెరీర్ మరో స్థాయికి చేరుకుంది.

Exit mobile version