నేచురల్ స్టార్ నాని నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘టక్ జగదీష్’. నాని సరసన రీతువర్మ నాయికగా నటించగా, జగపతిబాబు, ఐశ్వర్యా రాజేశ్, నాజర్, రోహిణి, దేవదర్శిని, నరేశ్, రావు రమేశ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు తమన్ స్వరాలూ సమకూర్చాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈనెల 23న విడుదల కావాల్సిన ‘టక్ జగదీష్’ వాయిదా పడింది. అయితే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా థియేటర్లు మూత పడుతున్నాయి. దీంతో ‘టక్ జగదీష్’ను ఓటిటిలో విడుదల చేసే అవకాశం ఉండొచ్చనే చర్చ మొదలైంది టాలీవుడ్. అయితే ‘టక్ జగదీష్’ ఓటిటి రిలీజ్ కు నాని సుముఖంగా లేరట. నానితో పాటు చిత్ర నిర్మాతలు కూడా ఏదేమైనా ఈ చిత్రాన్ని థియేటర్లోనే విడుదల చేయాలని భావిస్తున్నారట. గతంలో నాని హీరోగా నటించిన ‘వి’ చిత్రాన్ని ఓటిటి వేదికపై విడుదల చేశారు. అయితే ఆ చిత్రం నానికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. అందుకే ప్రస్తుతం ‘టక్ జగదీష్’ను ఓటిటిలో విడుదల చేయడానికి నాని సిద్ధంగా లేడట…!
‘టక్ జగదీష్’ ఓటిటి రిలీజ్ కు సుముఖంగా లేడట…!
