NTV Telugu Site icon

Nani : నెట్ ఫ్లిక్స్ లో సరిపోదా శనివారం తాండవం..!

Untitled Design (21)

Untitled Design (21)

నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయల కాంబోలో వచ్చిన ద్వితీయ చిత్రం ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా, SJ సూర్య పవర్ ఫుల్ రోల్ నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మించారు. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రూ. 100 కోట్ల క్లబ్ లో చేరింది. అటు ఓవర్సీస్ లో నార్త్ అమెరికాలో నాని కెరియర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్  $2.05 మిలియన్ రాబట్టిన సినిమాగా నిలిచింది సరిపోదా శనివారం.

Also Read : Devara: దేవర గ్రాండ్ సక్సెస్ మీట్… ఎప్పుడంటే..?

సరికొత్త కథాంశంతో వచ్చిన ఈ చిత్రంలో నాని, SJ సూర్యల అద్భుత నటన ప్రేక్షకులను విశేషంగా అలరించింది. గతంలో నాని – వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన అంటే సుందరానికీ నిరాశపరిచినా ‘సరిపోదా శనివారం’ తో ఆ బాకీ తీర్చేసాడు. కాగా ఇటీవల ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు తీసుకు వచ్చింది. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన సరిపోదా శనివారం ఓటీటీ లో అదరగొడుతూ మిలియన్ వ్యూస్ రాబడుతోంది. అలాగే ఆల్ ఓవర్ ఇండియాలో నంబర్ 1 ప్లేస్ లో కొనసాగుతుంది. ఈ విషయమై సంతోషాన్ని పంచుకుంటూ నాని తన అఫిషియల్ X ఖాతాలో పోస్టర్ ను షేర్ చేసారు. కాగా సరిపోదా శనివారంకు కూడా నేచురల్ స్టార్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకుంటాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు

Show comments