టాలీవుడ్ యంగ్ హీరోలలో నేచురల్ స్టార్ నాని దసరా, హాయ్ నాన్న వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని జోరు మీదున్నాడు. సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేసేందుకు ప్రస్తుతం చేస్తున్న సినిమాలు విషయంలోను తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాను నాని. ఈ యంగ్ హీరో ప్రస్తుతం HIT 3 అనే ఫ్రాంచైజీలో హీరోగా నటిస్తున్నాడు. HIT 1,2 భాగాలను నాని నిర్మించగా మూడవ భాగంలో తానే నటిస్తూ, నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచింది. నేడు ఈ సినిమా ట్రైలర్ రానుంది.
ఈ సినిమాతో పాటు దసర కి సీక్వెల్ గా ‘ది ప్యారడైజ్’ ను సెట్స్ పైకి తీసుకువెళ్ళాడు నాని. అయితే నేచురల్ స్టార్ మరోక యంగ్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తోంది. తమిళ్ లో శివ కార్తికేయన్ హీరోగా 2022 లో రిలీజై సూపర్ హిట్ అయిన డాన్ సినిమాను డైరెక్ట్ చేసాడు సిబి చక్రవర్తి . ఈ యంగ్ దర్శకుడు నేచురల్ స్టార్ కోసం ఓ కథను సిద్ధం చేసాడట. ఇటీవల నానిని కలిసి స్టోరీని వినిపించాడట సిబి చక్రవర్తి. సిబి చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట నాని. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను కూడా స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్ట మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. నేడు నేచురల్ స్టార్ నాని పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.