నేచురల్ స్టార్ గా ఫ్యామిలీ ఆడియన్స్ లో తనకంటూ ప్రత్యేకమయిన గుర్తింపు తెచ్చుకున్న నాని పుట్టినరోజు ఈ రోజు. ముందుగా నానీకి హ్యాపీ బర్త్ డే.అయితే ఈ బర్త్ డే సందర్భంగా నానీ నటిస్తున్న హిట్ 3 టీజర్ రిలీజ్ చేసారు మేకర్స్.అయితే ఈ హిట్ 3 టీజర్ ఎలా ఉంది అంటే అసలు మనం చూస్తున్నది నానీనేనా అనేలా ఉంది.ఆ రేంజ్ లో ఉంది మేకోవర్.ఈ మధ్యన వస్తున్న కల్ట్ వైలెన్స్ మూవీస్ కి తీసిపోనట్టుగా దీన్ని తీర్చిదిద్దారు.కాప్ స్టోరీ అంటేనే కంపల్సరీ కాస్తంత యాక్షన్ ఉంటుంది.కానీ ఈ సినిమాలో అంతకుమించి అనిపించేంతగా ఉంది.
అయితే వేరే హీరోలు ఎవరయినా ఈ టీజర్ చూసి ఆశ్చర్యపోనక్కర్లేదు.కానీ నాని నుండి ఇలాంటి ట్రైలర్ మాత్రం నిజంగా ఊహించని సర్ప్రైజ్.నానీ సినిమాలకు బ్రహ్మరథం పట్టే ఫ్యామిలీ ఆడియన్స్, మరీ ముఖ్యంగా పిల్లలు థియేటర్స్ లో చూడడానికే లేనట్టుగా ఓవర్ డోస్ వైలెన్స్ తో షాకిచ్చాడు.హిట్ సిరీస్ 3వ ఇన్స్టాల్మెంట్ అన్నౌన్స్మెంట్ లో చెప్పిన మాటను టీజర్ తో ప్రూవ్ చేసాడు.కేవలం వైలెన్స్ మాత్రమే కాదు నాని నోటి నుండి వచ్చిన మాటలు వింటే మనం విన్నది నిజమేనా అన్నట్టు అనిపించింది.మినిమమ్ కంటెంట్ తో వచ్చినా సాలిడ్ హిట్ పట్టుకెళిపోయే ఫ్యాన్ బేస్ నుండి నాని ఎందుకు దూరంగా జరుగుతున్నాడు అనే విషయం అర్ధం కావట్లేదు జనాలకు.దసరాతో సాలిడ్ మాస్ అనిపించుకోవాలి అనుకున్న కోరిక తీరినా కూడా అనుకున్న రేంజ్ హిట్ మాత్రం దక్కలేదు.అయినా ఎప్పుడూ ఒక ఇమేజ్ ఉండడానికి ఇష్టపడను అని చెప్పే నానీ ప్రస్తుతం మాత్రం మాస్ మంత్రం వదలకుండా పఠిస్తున్నాడు, ఆ జోనర్ సినిమాల్లోనే నటిస్తున్నాడు.హిట్ 3,దసరా 2 రెండూ ఊర మాస్ సినిమాలే.మరి ఆ రెండు సినిమాల తర్వాతయినా మళ్ళీ డిఫరెంట్ జోనర్ సినిమాలు చేస్తాడా లేక నేనింతే అంటాడో చూడాలి.
”అదే అనుకుని మోసపోయారు ఇన్నాళ్లు జనం… నీకు చూపిస్తా ఒరిజినల్” అనే కొసమెరుపు డైలాగ్ తో ఎవరికి ఏం చెప్పాలనుకున్నాడో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.