ఇటీవల నేచురల్ నాని ప్రధాన పాత్రలో రూపొందిన ‘హిట్ 3’ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ మూవీ మేడే కానుకగా, ప్రపంచ వ్యాప్తంగా విడుదలై అంచనాలను మించి.. సూపర్ హిట్‌గా నిలిచింది. టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ చిత్రంపై భారీ హైప్ నెలకొన్నగా. అనుకున్నట్లుగానే బాక్సాఫీస్ వద్ద ఊహించని విద్ధంగా వంద కోట్ల కలెక్షన్స్ అవలీలగా దాటేసింది. నాని ముందు చిత్రాలతో పోలిస్తే ఇందులో రక్తపాతం, హింస ఎక్కువైందని విమర్శలు వచ్చినా ఆడియెన్స్‌కు మాత్రం ఈ చిత్రం మంచి కిక్ ఇచ్చింది.
Also Read : Genelia : తృటిలో తప్పిన ప్రమాదం.. కొడుకుతో సహా ప్రాణాలతో బయటపడ్డ జెనీలియా
ఇక నాని కెరీర్లోనే, రికార్డు ఓపెనింగ్స్‌ని అందుకున్న ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను, ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా, ఇందుకోసం రూ. 50 కోట్లకు పైగానే చిత్ర బృందానికి చెల్లించినట్లు సమాచారం. కాగా తాజా సమాచారం ప్రకారం మే 29 నుంచి ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు తెలియజేశారు. ఇక థియేటర్‌లో మిస్ అయి.. ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్న వారు మరికొన్ని రోజులో ఇంట్లో కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు.
