Site icon NTV Telugu

Nani : యూఎస్ ప్రీమియర్స్‌లో రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘హిట్-3’

Hit 3 (2)

Hit 3 (2)

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న వరుస చిత్రల్లో హిట్ 3 ఒకటి. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇందులో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో ఇదివరకు ఎప్పుడూ చూడని మాస్ యాంగిల్ లో  రఫ్పాడించనున్నారు. దీంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. కాగా ఈ మూవీ మే 1న గ్రాండ్ వరల్డ్‌వైడ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. అయితే..

Also Read: Mohanlal : స్ట్రీమింగ్‌కు వచ్చేసిన ‘ఎల్2 ఎంపురాన్’

ఈ సినిమాను ఓవర్సీస్‌లోనూ భారీ అంచనాల మధ్య రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే యూఎస్‌లో ‘హిట్-3’ ప్రీమియర్స్‌కు అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ షురూ అయ్యాయి. ఈ క్రమంలో సినిమా రిలీజ్‌కు వారం ముందుగానే ఈ చిత్రం అక్కడ రికార్డులు క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది. సమాచారం ప్రకారం ‘హిట్-3’ మూవీ యూఎస్ ప్రీమియర్స్ ప్రీ-సేల్స్‌లో ఏకంగా 100K డాలర్ల వసూళ్లు రాబట్టినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. అంటే దీని బట్టి ఈ సినిమా అక్కడ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం నాని అమెరికా కూడా వెళ్లనుండటంతో, ఓవర్సీస్ మార్కెట్‌లో ‘హిట్-3’ అదిరిపోయే వసూళ్లు రాబట్టడం ఖాయమని సినీ సర్కిల్స్ చెబుతున్నాయి.

Exit mobile version