NTV Telugu Site icon

Nani : ‘ది ప్యారడైజ్’ మూవీకి ఊహించని బ్రేక్..?

Nani (2)

Nani (2)

ఎలాంటి సపోర్ట్ లేకుండా, ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుడా తన సొంత ట్యాలెంట్‌తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు హీరో నాని. క‌ష్టాన్ని న‌మ్ముకొని తన ట్యాలెంట్ తో అద్భుతం అయిన నటనతో టాప్ హీరోగా ఎదిగాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌తో అత‌ని కెరీర్ మొద‌లు పెట్టి ఇప్పుడు స్టార్ హీరోల‌లో ఒక‌రిగా, స‌క్సెస్ ఫుల్ నిర్మాత‌గా ధూసుకుపోతున్నాడు.

నాని నటించిన  కొని సినిమాలు సూప‌ర్ హిట్ కాక‌పోయిన ఫ్లాప్ మాత్రం కాలేదు. క‌నీసం ఎబోవ్ యావ‌రేజ్ టాక్‌తో అయిన న‌డుస్తాయి. అలాగే.. నిర్మాత‌గా ఇండ‌స్ట్రీకి కొత్త వారిని ప‌రిచ‌యం చేస్తూ మంచి స‌క్సెస్‌లు అందుకుంటున్నా నాని కేవలం తన మార్కెట్‌ను మెయింటైన్ పెంచుకోవ‌డం కాకుండా ఇండ‌స్ట్రీకి కొత్త ద‌ర్శకుల‌ని ప‌రిచ‌యం చేస్తున్నాడు. ఇక పోతే తాజాగా ‘కోర్ట్’ సినిమాతో మంచి విజయం అందుకున్న నాని హీరోగా వరుస సినిమాలు లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో ‘ది ప్యారడైజ్’ ఒకటి. ఈ మూవీలో ఊహించని విదంగా సరి కొత్త అవతారం ఎత్తాడు నాని. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది.

శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో తెరకెక్కుతున్నా ఈచిత్రం షూటింగ్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా షూటింగ్ ఇక వేసవి తర్వాతే ప్రారంభం అవుతుందని చిత్ర వర్గాల టాక్. దీంతో నానికి అనుకోకుండా బ్రేక్ లభించించడంతో తన ఫ్యామిలీతో కలిసి ఏదైనా హాలిడే ట్రిప్ ప్లాన్ చేయాలని చూస్తున్నాడట నేచురల్ స్టార్. మరిక ఈ సినిమా బ్రేక్ ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి.