ఈ ఏడాది సెప్టెంబరు నందమూరి ఫ్యాన్స్ కు చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు అప్ డేట్స్ ఫ్యాన్స్ ను ఫుల్ జోష్ ఇవ్వనుంది. ముందుగా బాలయ్య వంతు. నందమూరి రెండవ తరం నటుడుగా టాలీవుడ్ లో అడుగుపెట్టి 50సంవత్సరాలు అవుతున్న కారణంగా భారీ స్థాయిలో ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు సౌత్ ఇండియా స్టార్ నటీనటులు హాజరుకానున్నారు. తారక్ కూడా వచ్చే అవకాశం ఉంది. వస్తే ఇంక నందమూరి అభిమానులకు పండగే.
Also Read: Nagendra Babu: సినిమా పరిశ్రమ ఎవడబ్బ సొత్తుకాదు..ఇక్కడ టాలెంట్ ముఖ్యం..
ఇకనందమూరి ఫ్యాన్స్ ఎన్నాళ్లుగానో బాలయ్య కుమారుడు ఎంట్రీ కోసం ఎదుచూస్తున్నారు. సెప్టెంబరు 6న నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు. ఈ పుట్టిన రోజు నాడు నందమూరి నాలుగవ తరం నటుడిగా టాలీవుడ్ లో అడుగు పెట్ట్టబోతున్నాడు మోక్షు. హనుమాన్ సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞ మొదటి సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమా 6న పూజ కార్యక్రమంతో ప్రారంభించనున్నారు. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు.
మరోవైపు గ్లోబల్ స్టార్ jr. ఎన్టీయార్ పాన్ ఇండియా చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గారు రిలీజ్ కానుంది. RRR తర్వాత వస్తోన్న ఈ చిత్రంలో తారక్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన దేవర ఫస్ట్ గ్లిమ్స్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇటీవల రిలీజ్ అయిన రెండు సాంగ్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇలా ఒకే నెలలో మూడు న్యూస్ తో నందమూరి ఫ్యాన్స్ సెప్టెంబరు నెలను నందమూరి నెల పిలుచుకుంటున్నారు ఫ్యాన్స్.